ఆటగాళ్లు పోటుగాళ్ళు అంటూ రెండు టీమ్స్ గా డివైడ్ చేసి గేమ్స్ ఆడిస్తున్నాడు బిగ్ బాస్. ఇందుకు గాను విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి ఏకంగా ఏడూ గేమ్స్ పెట్టాడు. ఈ గేమ్స్ లో ఆటగాళ్లు టీమ్ విన్ అయ్యింది. మొత్తం ఏడూ గేమ్స్ లో నాలుగు గేమ్స్ విన్ అయ్యి సత్తా చాటారు ఆటగాళ్లు, నిన్నటి ఎపిసోడ్ లో ఆటగాళ్లు టీమ్ విన్ అవ్వడంతో కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఆటగాళ్ల టీమ్ కు దక్కింది. ఆటగాళ్ల టీమ్ లో ఉన్న ఒకరికి బిగ్ బాస్ హౌస్ కు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఆటగాళ్ల టీమ్ లో ఉన్న వారు బాలన్స్ ధరించాలని.. పోటుగాళ్ళు టీమ్ లో వాళ్ళు పిన్ ను దక్కించుకొని ఆటగాళ్ల టీమ్ లో ఒకరికి ఇవ్వాలని చెప్పాడు బిగ్ బాస్. ఆ పిన్ తో ఆటగాళ్ల టీమ్ మెంబర్స్ కెప్టెన్ కు అనర్హులు అనుకునే వారి బెలూన్ ను పంచర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా పోటుగాళ్ళు టీమ్ లో పూజా పిన్ ను సందీప్ మాస్టర్ కు ఇచ్చింది. దాంతో ఆయన శివాజీ బెలూన్ ను పంచర్ చేశాడు.
ఇలా ఒకొక్కరు ఒక్కొక్కరిని సెలక్ట్ చేసుకొని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పిస్తూ వచ్చారు. చివరకు యావర్ విన్ అవ్వడంతో కొత్త కెప్టెన్ గా యావర్ నిలిచాడు. అంతకు ముందు కొత్తగా వచ్చిన హౌస్ మెట్ అర్జున్ తన నిజస్వరూపం బయట పెట్టాడు. ప్రశాంత్ కెప్టెన్ గా హౌస్ లో ఉన్న వారికీ పనులు అప్పజెప్తూన్నాడు కానీ తన గురువు అయిన శివాజీకి మాత్రం ఏం పని చెప్పడం లేదు. దాంతో అర్జున్ ప్రశాంత్ ను పిలిచి.. అందరికీ పనులు చెప్తున్నావ్.. మరి శివాజీకి ఎందుకు చెప్పడం లేదు.. బయట జనాలు చూస్తున్నారు బాగోదు ఆయనకు కూడా ఎదో ఒక పని చెప్పు అని అన్నాడు.
శివాజీ అన్నకు చేయి బలేదు కదా అందుకే ఆయనకు పని చెప్పలేదు అని అన్నాడు. దాంతో అర్జున్ అలా కాదు ఆయనకు ఏదోఒక పని చెప్పు. ఇప్పుడు అమర్ తెలుగులో మాట్లాడేలా చూడటం.. తేజ నిద్రపోకుండా చూడటం ఇలాంటివి చెప్పు అని అన్నాడు. దాంతో ప్రశాంత్ అదే పని చేశాడు. ఆతర్వాత నైట్ సీరియల్ బ్యాచ్‌తో కలిసి పల్లవి ప్రశాంత్ గురించి కామెంట్స్ చేశాడు. ప్రశాంత్ గురించి మాట్లాడుతూ.. వీడ్ని కెప్టెన్‌గా పెట్టుకున్నారు.. ప్రతి దానికి అన్న అన్న అన్న అని అంటాడు. ఈ వెర్రి పుష్పం గాడికి రేపు బట్టలు ఇస్తానని చెప్తే.. శివాజీ అన్నని అడిగి వేసుకుంటానంటాడేంటి.? అంటూ గౌతమ్ దగ్గర నోరు పారేసుకున్నాడు. వీడి మంచికే చెప్పినా వినడం లేదు.. ఒక్క టాస్క్ పడనియ్ వీడి సంగతి చెప్తా అని అన్నాడు. అసలు మొన్న జరిగిన కలర్స్ టాస్క్‌లోనే వాడ్ని మడత పెట్టేయాల్సింది.. ఎందుకు వదిలేశావ్.? అని గౌతమ్ తో అన్నాడు అర్జున్. దాంతో ప్రేక్షకుల్లో అర్జున్ పై బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ అయ్యింది.
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.