Most Recent

Ranya Rao: రన్య రావు కేసులో మరో ట్విస్ట్.. ఆమె భర్తను అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు..

Ranya Rao: రన్య రావు కేసులో మరో ట్విస్ట్.. ఆమె భర్తను అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు..

బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యరావు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఇప్పటికే డీఆర్‌ఐ, సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేశాయి. రన్యరావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో ఆమె భర్త జతిన్ హుక్కేరికి కోర్డులో ఉపశమనం కలిగింది. రన్యరావు కేసు విషయంలో ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఆమెకు ఎవరెవరు సహకరించారు… ? బంగారం అక్రమ రవాణాలో ఎంత మంది ప్రమేయం ఉందని ? పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే తనను అరెస్ట్ చేస్తారనే భయంతో ఆమె భర్త జతిన్ హుక్కేరి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా అరెస్టు చేయవద్దని మార్చి 11న ఉత్తర్వులు జారీ చేసింది.

జతిన్ భార్యపై వచ్చిన ఆరోపణలతో అతనికి ఎలాంటి సంబంధం లేదట. DRI అధికారులు విచారణకు పిలిచినప్పుడు అతడు పూర్తిగా సహకరించాడని.. రెండుసార్లు అతడిని విచారించారట పోలీసులు. సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటించకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉందని జతిన్ తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదన విన్న హైకోర్టు, చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా జతిన్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశం జారీ చేసింది. దీంతో రన్యరావు భర్తకు ఉపశమనం లభించింది. నటి రన్యరావు బంగారం అక్రమ రవాణా కేసులో అనేక విషయాలు బయటకు వస్తున్నారు.

అయితే రన్య రావు గోల్డ్ స్మగ్లింగ్ గురించి పోలీసులకు ఆమె భర్త జతిన్ సమాచారం అందించినట్లు సమాచారం. ఎందుకంటే వీరిద్దరి వివాహం జరిగిన రెండు నెలల్లోనే రన్య దుబాయ్ కు వెళ్లి తిరిగి వచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని.. రన్య తరచుగా విదేశాలకు వెళుతుండటం వల్ల భార్యాభర్తల మధ్య గొడవ జరిగేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే రన్య భర్త ఆమె చేసే గోల్డ్ స్మగ్లింగ్ గురించి ఒక మంత్రికి సమాచారం పంపించారని.. ఆ తర్వాత మంత్రి స్వయంగా డీఆర్‌ఐ అధికారులకు సమాచారం ఇచ్చారని అనుమానిస్తున్నారు.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.