Most Recent

Jr.NTR: ఏమున్నాడ్రా బాబు.. ఎన్టీఆర్ న్యూ స్టైలీష్ లుక్ అదిరిపోయింది.. ఫోటోస్ చూశారా.. ?

Jr.NTR: ఏమున్నాడ్రా బాబు.. ఎన్టీఆర్ న్యూ స్టైలీష్ లుక్ అదిరిపోయింది.. ఫోటోస్ చూశారా.. ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొన్ని నెలలుగా వార్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దేవర బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తారక్ పూర్తిగా వార్ 2 సినిమాకే డేట్స్ ఇచ్చేశారు. మరోవైపు ఇటీవలే డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన సినిమా పట్టాలెక్కింది. ఇందుకు సంబంధించిన అప్డేట్ నీల్ తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. నివేదికల ప్రకారం ఈ సినిమాలో తారక్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఇటీవల జెప్టో ప్రకటనతో అడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ సమయంలో తారక్ లుక్స్ పై ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు స్టైలీష్ లుక్ లో కనిపించి అభిమానులకు షాకిచ్చాడు. బ్లాక్ జీన్స్, డెనిమ్ షార్ట్‏లో స్టైలీష్‏గా కనిపించాడు తారక్. దీంతో ఫ్యాన్స్ ఇప్పుడు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాల కోసం తారక్ తన లుక్ పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. హిందీలో రూపొందిస్తున్న వార్ 2 సినిమా చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీ షూటింగ్ లో ఓ సాంగ్ చిత్రీకరణలో హృతిక్ రోషన్ గాయపడినట్లు టాక్. దీంతో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.