-
బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా పాపులర్ అయ్యింది. కానీ ఆమె ప్రవర్తన కారణంగా ఎక్కువగా నెగిటివిటీని మూటగట్టుకుంది. ఈ షో కంటే ముందు పలు చిత్రాల్లో కథానాయికగా కనిపించింది. కానీ బిగ్బాస్ తర్వాత మాత్రం ఆమెకు అనుకున్నంతగా ఆఫర్స్ రాలేదు. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ?
-
ఈ అమ్మడు మరెవరో కాదు.. రతికా రోజ్.. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి చదువులలో చురుగ్గా ఉండే రతిక.. హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది.
-
అదే సమయంలో నటనపై ఆసక్తితో బుల్లితెరపైకి అడుగుపెట్టింది. మోడల్ గా పనిచేసిన రతిక.. 2020లో జబర్దస్త్ ఫేమ్ షకలక శంకర్ నటించిన బొమ్మ అదిరింది సినిమాతో కథానాయికగా మారింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేదు.
-
ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన నేను స్టూడెంట్ సర్ చిత్రంలో లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత బిగ్బాస్ షోలోకి అడుగుపెట్టి తన పాపులారిటీ మరింత పెంచుకోవాలని అనుకుంది.
-
కానీ ఊహించని విధంగా బిగ్బాస్ షోతో ఆమెకు ఎక్కువగా నెగిటివిటీ వచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది రతిక. తాజాగా ఈ అమ్మడు గ్లామర్ ఫోజులతో నెటిజన్లకు మతిపోగొడుతుంది.