Most Recent

Bigg Boss 7 Telugu: ప్రిన్స్ యావర్ బన్‌గయా నయా కెప్టెన్.. దిమ్మతిరిగేలా కొట్టుకున్న హౌస్‌మేట్స్‌ .. పౌరుషంతో ఊగిపోయిన రైతు బిడ్డ

Bigg Boss 7 Telugu: ప్రిన్స్ యావర్ బన్‌గయా నయా కెప్టెన్.. దిమ్మతిరిగేలా కొట్టుకున్న హౌస్‌మేట్స్‌ .. పౌరుషంతో ఊగిపోయిన రైతు బిడ్డ

రెండు రోజుల నుంచి.. ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్ల మధ్య వెరీ సీరియస్ గా సాగుతున్న కెప్టెన్సీ కంటెడర్స్‌ టాస్క్‌ ఈ రోజు అంటే.. 41వ ఎపిసోడ్‌లోనూ కంటిన్యూ అవుతుంది. ఈ సీజన్‌లో సెకండ్‌ కెప్టెన్సీ కంటెండర్స్‌ కోసం ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టాస్క్‌లో బిగ్ బాస్ మొత్తం 7 టాస్కులు కండెక్ట్ చేశాడు. వాటిలో ఎక్కువ టాస్కులు గెలిచిన టీంలోని సభ్యులే.. కెప్టెన్సీ కంటెండర్స్‌గా చివర్లో పోటీ పడతారు. ఆ పోటీలో గెలిచిన ఒకరు.. బిగ్ బాస్ సీజన్ 7 సెంకడ్ కెప్టెన్‌ గా బిగ్ బాస్ బోర్డ్ కెక్కుతాడు.

ఇక అందుకోసమే.. ఆటగాళ్లు టీంలో ఉన్న శివాజీ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్‌, సందీప్, అమర్‌, తేజ, శోభ, ప్రియాంక…! పోటుగాళ్లు టీంలో ఉన్న అర్జున్, గౌతమ్‌, భోళె, నయని, అశ్విని, పూజా మూర్తి.. వారి శక్తికి మించి పోటీపడతారు. బిగ్ బాస్ ఇచ్చిన అన్ని టాస్కుల్లో వారి వారి బెస్ట్ ఇస్తారు.

ఇక బిగ్ బాస్ ఇచ్చిన ఏడు టాస్కుల్లో.. ఫిటెస్ట్, జీనియస్, స్ట్రాంగెస్ట్ గా పోటుగాళ్లు నిలవగా.. ఫాస్టెస్ట్, స్మార్టెస్ట్, ఫోకస్‌డ్‌గా ఆటగాళ్లు నిలిచి.. పోటుగాళ్ల బోర్డ్‌తో తమ బోర్డును సమం చేస్తారు. దీంతో టై బ్రేకర్‌గా.. బిగ్ బాస్ చివరిదైన 7th టాస్క్‌ పెడతాడు.

ఇక టాస్క్‌లో భాగంగా.. ఇరుజట్ల మధ్య హూ ఈజ్‌ ది బెస్ట్ అనే టాస్క్‌ ఇస్తాడు. అచ్చం రగ్బీ లాగా ఉన్న గేమ్‌లో ఏ టీం ఎక్కువ గోల్స్ చేస్తారో.. వాళ్లే ఈ టాస్క్‌లో విన్నర్ అంటూ.. అనౌన్స్ చేస్తారు బిగ్‌ బాస్.

ఇక దాదాపు wwe రెజ్లింగ్‌లా సాగిన ఈ గేమ్‌లో.. ఇరు టీమ్‌లో ఉన్న ఫైటర్స్‌ ఓ రేంజ్‌లో ఫైట్స్ చేస్తారు. బాల్ కోసం.. గోల్ చేయడం కోసం ఒకరి మీద ఇంకొకరు పడుతూ.. వాళ్ల వాళ్ల హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు. చూస్తున్న బీబీ ఆడియెన్స్‌లో కూడా.. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ కలిగిస్తారు. షోకు అతుక్కుపోయేలా చేస్తారు.

ఫైటింగ్, ఎమోషన్స్, చెవులు గిళ్లు మనే రిమైనింగ్ కంటెస్టెంట్ చీరప్స్‌ మధ్యలో.. రసవత్తరంగా ఉన్న పోరులో.. పోటగాళ్ల పై ఆటగాళ్లే లీడ్‌ సాధిస్తారు. పాయింట్ల పట్టికలో దూసుకుపోయి విన్నర్‌గా నిలుస్తారు. టై బ్రేక్గా కండెక్ట్ చేసిన ఈ టాస్క్‌లో విన్నర్‌గా నిలిచి.. ఏకంగా కెప్టెన్సీ కంటెడర్స్‌ స్టేజ్‌కు వెళతారు ఆటగాళ్లు టీం. అంతేకాదు బిగ్ బాస్ అభినందనలు కూడా పొంది బెస్ట్ ట్యాగ్‌ సంపాదిస్తారు.

ఇక తరువాత నేరుగా.. కెప్టెన్సీ కంటెడర్స్‌ టాస్క్‌కు అప్‌గ్రేడ్ అయిన ఆటగాళ్లకు టీంకు.. మరో డిఫరెంట్ అండ్ పిట్టింగ్ టాస్క్‌తో ముందుకు వచ్చారు బిగ్ బాస్. ఆటగాళ్లు టీంలో ఉన్న కెప్టెన్నీ కంటెడర్స్‌ అందరూ బెలూన్ ధరించాలని చెప్పిన బిగ్ బాస్.. బజ్‌ మోగగానే.. బిగ్ బాస్ హాలులో ఉన్న పిన్‌ను పోటుగాళ్లు ముందుగా చేజిక్కించుకోవాలని.. అలా చేజిక్కించుకున్న వాళ్లు.. వాళ్లకు నచ్చిన ఆటగాళ్ల ఇవ్వాలని చెబుతాడు. ఇక పోటుగాళ్ల నుంచి పిన్ అందుకున్న ఆటగాడు.. తనకు ఎవరైతే కెప్టెన్‌గా అన్‌ఫిట్ అనుకుంటాడో.. వాళ్ల బెలూన్‌కు గుచ్చి గాలితీసి.. వాళ్లను కెప్టెన్సీ టాస్క్‌ నుంచి తొలగించాలని చెబుతాడు. అందుకు సరైన రీజన్ కూడా చెప్పాలంటూ.. కాస్త గట్టిగా చెబుతాడు. ఇక సింపుల్‌గా చెప్పాలంటే.. పిన్ తీసుకున్న పోటుగాళ్లు.. ఆటగాళ్లలో ఒకరికి ఇస్తే.. వాళ్లలో వాళ్లు గుచ్చుకుని పోటీ నుంచి తప్పించుకుంటారన్న మాట.

ఇక ఈ గేమ్‌ మొదలయ్యే ముందు.. ఆటగాళ్లందరూ.. పోటుగాళ్ల మద్దతు కోసం ఓ రేంజ్‌లో కష్టపడతారు. పిన్ తమకే ఇవ్వాలని ఇన్‌ఫ్లూయెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే ఆటగాళ్ల కంటే.. పోటుగాళ్లు.. అందులోనూ.. అర్జున్, కాస్త ఆలోచించి ఆడతాడు. చివర్లో తేజ, అమర్, ప్రిన్స్ ఉండగా.. తెలివిగా.. తేజకు పిన్‌ ఇచ్చి.. బయట అందరూ చూస్తున్నారు ఫేర్ గా డిసీషన్ తీసుకో అని చెబుతాడు. దీంతో తేజ.. అమర్‌కు బెలూన్‌కు గుచ్చుతాడు. అమర్ అల్మోస్ట్ ఏడ్చినంత పని చేసినప్పటికీ.. తన రీజన్ ఏంటో చెబుతాడు. సాక్రిఫైజ్ టాస్క్‌లో ప్రిన్స్ తనకు హెల్స్‌ చేశాడు కనుక.. తనుకు ఈ టాస్క్లో పే బ్యాక్ చేస్తున్నా అని చెబుతాడు. అయితే ఆ రీజన్‌తో సాటిఫై కానీ.. అమర్‌ గోల మధ్యలో.. ప్రిన్స్ యావర్‌ను.. బిగ్ బాస్ సీజన్‌ 7 న్యూ కెప్టెన్‌గా అనౌన్స్ చేస్తాడు బిగ్‌ బాస్.

 

ఇక ఈ టాస్క్‌లో.. పూజ నుంచి మొదట పిన్ దక్కించుకున్న సందీప్.. శివాజీని గేమ్ నుంచి తొలగిస్తాడు. రీజన్‌గా శివాజీకి హెల్త్‌ బాలేదంటూ చెబుతాడు. ఆ తరువాత భోళె దగ్గరి నుంచి పిన్ దక్కించుకున్న ప్రశాంత్.. ప్రియాంక దగ్గరున్న బెలూన్‌కు గుచ్చుతాడు. ఆ తరువాత నయని పావని నుంచి పిన్ అందుకున్న సందీప్.. ప్రశాంత్ బెలూన్ ను పేలుస్తాడు. దీంతో ప్రశాంత్ తన బెలూన్ ఎందుకు పేల్చావ్‌.. తాను చేసిన తప్పేంటంటూ.. సందీప్‌ పై పౌరుషంతో ఊగిపోతాడు. ఆ తర్వాత అశ్విన దగ్గరి నుంచి పిన్ అందుకున్న శోభ.. సందీప్ బెలూన్‌ను.. గౌతమ్‌ దగ్గరి నుంచి పిన్ అందుకున్న ప్రిన్స్ యావర్ శోభ బెలూనుకు గుచ్చి గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తాడు. ఇలా చివరగా ఉన్న ప్రిన్స్ యావర్‌, అమర్ , తేజలో పైన చదివినట్టు.. గేమ్ రసవత్తరంగా సాగి.. ప్రిన్స్ ను కెప్టెన్‌గా ఎన్నికయ్యేలా చేస్తుంది.

 

– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.