
తెలుగులో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచింది. ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కట్ చేస్తే.. 8 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం అదరగొడుతుంది. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమాకు అటు కలెక్షన్స్ సైతం అంతగా రాలేదు. దాదాపు రూ.19 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. మనమే. టాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ హీరో శర్వానంద్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. లవ్ స్టోరీ, కామెడీతో ఈ సినిమాను రూపొందించారు.
ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, అయేషా ఖాన్ ముఖ్యపాత్రలు పోషించారు. మనమే చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించగా.. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, పాటలతో సినిమాపై మంచి క్యూరియాసిటీని కలిగించారు. ఈ సినిమాలో మొత్తం పది పాటలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రామ్సే స్టూడియోస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా కాలం నిరీక్షణ తర్వాత అంటే థియేటర్లలో విడుదలైన 8 నెలల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది ఈసినిమా.
మనమే సినిమా మార్చి 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి నుంచి ఈ సినిమాకు మంచి వ్యూస్ వస్తున్నాయి. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రైమ్ వీడియో నేషనల్ ట్రెండింగ్ లో టాప్ లోకి దూసుకువచ్చేసింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియో టాప్ లో ట్రెండ్ అవుతుంది మనమే. ఇప్పుడు ఈ మూవీ తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన ఈ సినిమా.. ఇప్పుడు మాత్రం ఓటీటీలో అదరగొడుతుంది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..