Most Recent

Sai Pallavi: మరోసారి డాన్స్‌తో అదరగొట్టిన సాయి పల్లవి.. ఎంత క్యూట్‌గా చేసిందో చూడండి

Sai Pallavi: మరోసారి డాన్స్‌తో అదరగొట్టిన సాయి పల్లవి.. ఎంత క్యూట్‌గా చేసిందో చూడండి

అందాల భామ సాయి పల్లవి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. రీసెంట్ గానే రెండు సినిమాలతో భారీ హిట్స్ అందుకుంది. తమిళ్ లో శివకార్తికేయన్ హీరోగా నటించిన అమరన్ సినిమాలో నటించింది సాయి పల్లవి. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే తెలుగులో నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవి తండేల్ అనే సినిమాలో నటించింది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉంది. సాయి పల్లవి నటి మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా .. ఇక సాయి పల్లవికి స్టార్ హీరోలకు సమానంగా ఫ్యాన్స్ ఉన్నారు. సాయి పల్లవి ఇటీవల తన బంధువు వివాహానికి హాజరయ్యారు. సాయి పల్లవి తన సోదరి,బంధువులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి :ఎన్టీఆర్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా అదరగొట్టిందిగా..

సాయి పల్లవి డ్యాన్స్ చూసిన అభిమానులు ఆమె ఎనర్జీని ప్రశంసిస్తున్నారు. వైరల్ వీడియోలో, నటి సాయి పల్లవి అందమైన చీరలో కనిపిస్తుంది. బౌన్సీ పాట మ్యూజిక్ కు అనుగుణంగా డాన్స్  చేయడం అభిమానులను బాగా ఆకట్టుకుంది. గతంలో సాయి పల్లవి తన చెల్లెలు పూజా పెళ్లిల్లోనూ డాన్స్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా మరోసారి సాయి పల్లవి డాన్స్ చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఈమెను మించిన హాట్ బ్యూటీ ఉంటుందా..! చేసింది రెండు సినిమాలు.. ఒకొక్క మూవీకి అందుకుంటుంది రూ.3 కోట్లు

కాగా సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమా చేస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సాయి పల్లవి నటిస్తుంది. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా నటిస్తుంది. అలాగే యష్ ఈ సినిమాలో రావణుడిగా నటిస్తుంది. అలాగే ఈ అమ్మడు తెలుగు, తమిళ్ సినిమాలో ఆఫర్స్ అందుకుంటుంది. ఇక సాయి పల్లవి డాన్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి: ప్రేమించినవాడి కోసం మతం మార్చుకుంది.. పేరు మార్చుకుంది.. చివరకు ఇలా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.