Most Recent

అప్పట్లో షార్ట్ ఫిలిమ్స్ చేసింది.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. కానీ ఇలా

అప్పట్లో షార్ట్ ఫిలిమ్స్ చేసింది.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. కానీ ఇలా

ఎంతో మంది ముద్దుగుమ్మలు కోటి ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ తో మెప్పించి ఆతర్వాత హీరోయిన్స్ గా అవకాశాలు అందుకున్నారు. అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. పై ఫొటోలో ఉన్న బబ్లీ గర్ల్ ను గుర్తుపట్టారా.? ఎంత ముద్దుగా ఉందో కదా.. ఆమె ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు హీరోయిన్ ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అలాగే తొలి సినిమానే స్టార్ హీరో పక్కన ఛాన్స్ అందుకుంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఆ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరంటే..

షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన హీరోలు, హీరోయిన్స్ తమ టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రాజ్ తరుణ్, సుహాస్, చాందిని చౌదరి, కిరణ్ అబ్బవరం, దర్శకుడు సందీప్ రాజ్ ఇలా ఎంతో మంది షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి సక్సెస్ అయ్యారు. అలాగే పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు కూడా.. ఆమె మరెవరో కాదు ప్రియాంక జవాల్కర్. ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాల సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు  తెచ్చుకుంది. ఈ సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

ఆతర్వాత గమనం,ఎస్ఆర్ కల్యాణమండపం, తిమ్మ‌రుసు సినిమాల్లో నటించింది వీటిలో టాక్సీవాల, ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.  ఇప్పుడు ఈ బ్యూటీ సినిమాలు లేక ఖాళీగా ఉంది. సినిమాల్లోకి రాక ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. పై ఫోటో ఓ షార్ట్ ఫిలిమ్ లోనిది. ఇప్పుడు ఈ అమ్మడు చాలా మారిపోయింది. అలాగే సోషల్ మీడియాలో ప్రియాంక షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్లను తెగ కవ్విస్తున్నాయి. అందాలతో ఫిదా చేస్తుంది ఈ అమ్మడు.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Jawalkar (@jawalkar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.