Most Recent

పెళ్లీడుకొచ్చిన కూతురు.. 22ఏళ్ల తర్వాత విడాకులు అనౌన్స్ చేసిన నటి.. నెటిజన్స్ ఏమంటున్నారంటే

పెళ్లీడుకొచ్చిన కూతురు.. 22ఏళ్ల తర్వాత విడాకులు అనౌన్స్ చేసిన నటి.. నెటిజన్స్ ఏమంటున్నారంటే

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన విడాకుల వార్తలే వినిపిస్తున్నాయి సామాన్యుల దగ్గర నుంచి సినీ సెలబ్రెటీల దాక అందరూ విడాకుల బాట పడుతున్నారు. కొత్త పెళ్ళైన వారే కాదు 18, 20ఏళ్లు కాపురాలు చేసిన వారు కూడా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు. సామాన్యుల మాట అటుంచితే ముఖ్యంగా సెలబ్రెటీలు. ఏ జంట ఎప్పుడు విడాకులు అనౌన్స్ చేస్తారో అనే సస్పెన్స్ ఇప్పుడు అభిమానుల్లో ఉంది. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రెటీలు విడిపోతున్నట్టు ప్రకటించారు. మొన్నీమధ్య నయనతార దంపతులు కూడా విడిపోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అది విని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు అది ఒట్టి రూమర్ మాత్రమే అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి :ఏం సినిమా రా అయ్యా..! అమ్మాయిలను మాత్రమే చంపే కిల్లర్.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు

సినిమా వాళ్లు మాత్రమే కాదు సీరియల్ నటులు కూడా విడాకుల తీసుకుంటున్నారు. ఈ మధ్య చాలా మంది బుల్లితెర నటులు కూడా విడిపోతున్నట్టు ప్రకటించారు. తాజాగా మరో సీరియల్ నటి కూడా భర్తతో విడిపోతున్నట్టు అనౌన్స్ చేసింది. 22 ఏళ్ల కాపురానికి పులిస్టాప్ పెట్టేసింది ఆమె.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పల్లవి రావు. బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంది. హిందీలో పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది పల్లవి రావు.

ఇది కూడా చదవండి :Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్‌లోకి ఫోక్ సింగర్.. దేశాన్నే ఊపేసిన పాటలు పాడింది

పాండ్యా స్టోర్‌తో అనే సీరియల్ తో పాపులర్ అయ్యింది పల్లవి. అలాగే అక్కడ పలు సీరియల్స్ లో విభిన్నమైన పాత్రలు చేసి మెప్పించింది. యహాన్ మే ఘర్ ఘర్ ఖేలీ, పునర్ వివాహ ఏక్ నయీ ఉమీద్, మెయిన్ లక్ష్మీ తేరే అంగన్ కీ, బిట్టో, పాండ్యా స్టోర్, కహానీ హుమారే మహాభారత్ కీ వంటి సీరియల్స్ లో నటించింది. సీరియల్స్ తో పాటు పలు యాడ్స్ లోనూ కనిపించింది. కాగా ఈ నటి దర్శకుడు సూరజ్ రావు వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురికి 21, కొడుకు 18. కాగా 22ఏళ్ల వివాహబంధానికి వీరు ఇప్పుడు ముగింపు పలికారు. పల్లవిరావు  తన భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించింది. కానీ ఆమె భర్త సూరజ్ రావు దీని పై స్పందించలేదు. పల్లవి రావు విడాకుల పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఆమె అభిమానులు ఈ వార్త విని షాక్ అవుతున్నారు. 

ఇది కూడా చదవండి : అందం ఎక్కువైంది.. ఆఫర్ మిస్ అయ్యింది..! బడా సినిమా నుంచి స్టార్ హీరోయిన్ అవుట్

 

View this post on Instagram

 

A post shared by Pallavi Rao (@pallavi_s_rao)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.