
1964లో తీసిన ఈ సినిమాలో హీరోగా అక్కినేని నాగేశ్వరరావు, హీరోయిన్ లుగా సావిత్రి, జమున నటించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ చిత్రం తర్వాత కోనసీమ, గోదావరి ప్రాంతాల్లో అవుట్ డోర్ షూటింగ్స్ ఎక్కువగా మొదలయ్యాయి. మద్రాసులోని స్టూడియోలకే పరిమితమైన చిత్ర నిర్మాణాలు ఒక విధంగా మూగమనసులు మూవీ తోనే అవుట్ డోర్ లోకేషన్స్ కు మారాయి. మూగమనసులు సినిమా హిందీలో మిలన్ గా తీశారు. ఈ సినిమాలో హీరో సునీల్ దత్. ఆయన కూడా అప్పట్లో నర్సాపురం వచ్చినట్లు నాటి జ్ఞాపకాలను స్థానికులు ఇప్పటికీ నెమరవేసుకుంటారు. వలందర రేవులోనే మూగమనసులు సినిమాలో నాగేశ్వరరావు పాడవ నడిపిన సన్నివేశాలు తీశారట. ప్రస్తుతం రేవులో పెద్ద ఆర్చ్ నిర్మాణం జరిగింది. దానికి ఎదురుగా ఉన్న టెంపుల్ సినిమాలో కనిపిస్తుంది. ఆ పక్కనే ఉన్న భవనాన్ని 1920లో డచ్ వాళ్లు నిర్మించారు. ఇప్పటికీ ఈ భవనం అలాగే చెక్కుచెదరకుండా ఉంది.
మరిన్ని వీడియోల కోసం :