Most Recent

Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్‌లోకి ఫోక్ సింగర్.. దేశాన్నే ఊపేసిన పాటలు పాడింది

Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్‌లోకి ఫోక్ సింగర్.. దేశాన్నే ఊపేసిన పాటలు పాడింది

బిగ్ బాస్ సీజన్ 9 కు రంగం సిద్ధం అయ్యింది. ఈ రియాలిటీ గేమ్ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో.. ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తుంది.. ఇప్పటికే ఈ రియాల్టీ గేమ్ షో తెలుగులో 8 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 9కు రంగం సిద్ధం అయ్యింది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభంకానుంది. దాదాపు 100రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్ లోకి ఓ ట్రెండింగ్ సింగర్ ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

రీసెంట్ డేస్ లో ఫోక్ సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నాయి.  భాషతో సంబంధంలేకుండా పాన్ ఇండియా రేంజ్ పాపులర్ అవుతున్నాయి మన ఫోక్ సాంగ్స్.. ఇప్పటికే యూట్యూబ్ లో మిళియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి జానపదగీతాలు.. సోషల్ మీడియాలో దుమ్మురేపిన సాంగ్స్ లో తిన్నా తీరం పడుతలే.. కూసున్నా తీరం పడుతలే.., ఆనాడేమన్నంటినా తిరుపతి.. నిన్ను ఈనాడేమన్నంటినా తిరుపతి సాంగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇది కూడా చదవండి : Prabhas : ఆయన అలా అనగానే నాకు ఫస్ట్ టైమ్ కన్నీళ్లు వచ్చాయి.. జీవితంలో మర్చిపోలేనన్న ప్రభాస్

ఈ సాంగ్స్ తో మంది క్రేజ్ తెచ్చుకుంది ఈ స్టార్ సింగర్ ఆమె ఎవరో కాదు.. నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలం గన్నోర గ్రామానికి చెందిన లక్ష్మి. ఈ జానపద సింగర్ చిన్నతనం నుంచి పాటలు పాడుతుంది. ఫోక్ సాంగ్స్ తో పాపులరైన లక్ష్మీకి సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. ఏకంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2లో పీలింగ్స్ అనే సాంగ్ పాడే అవకాశం అందుకుంది. ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప 2 సినిమా కంటే ముందు బ్యాచ్ సినిమాలో ఓ సాంగ్, అలాగే దసర సినిమాలో ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌ సాంగ్ పాడింది లక్ష్మీ. అయితే లక్ష్మీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. దీని పై లక్ష్మీ స్పందిస్తూ.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. నా భర్త, ఏడాదిన్నర పిల్లాడే నా ప్రపంచం.. వాళ్ళను విడిచి నేను ఎక్కడికీ వెళ్ళను. దుబాయ్‌, మస్కట్‌ వంటి దేశాల్లో ప్రోగ్రామ్స్ కు వెళ్లలేక పోయాను.. బిగ్ బాస్ నేను చూస్తూ ఉంటాను.. అవకాశం వస్తే వెళ్ళడానికి ప్రయత్నిస్తా అని లక్ష్మీ చెప్పుకొచ్చింది. మరి ఈ సింగర్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుందేమో చూడాలి.

ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలతో చేశా.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ ఆవేదన

 

View this post on Instagram

 

A post shared by Dasa laxmi (@singer_laxmi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.