Most Recent

Anasuya: ఆన్‏లైన్‏లో మోసపోయిన అనసూయ.. డబ్బులు కాజేశారంటూ పోస్ట్..అసలేం జరిగిందంటే..

Anasuya: ఆన్‏లైన్‏లో మోసపోయిన అనసూయ.. డబ్బులు కాజేశారంటూ పోస్ట్..అసలేం జరిగిందంటే..

బుల్లితెరపై సినీప్రయాణం స్టార్ట్ చేసి ఇప్పుడు సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. యాంకర్‏గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు నటిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మాత పాత్ర అనసూయ కెరీర్ మలుపు తిప్పింది. ఇందులో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తర్వాత తెలుగులో వరుస సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అలరించింది. అటు సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‎గా ఉంటుంది. నిత్యం గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది. అలాగే నెట్టింట ట్రెండింగ్ టాపిక్స్ పై రియాక్ట్ అవుతుంటుంది.

అయితే తాజాగా తాను ఇప్పుడు ఆన్‏లైన్‏లో మోసానికి గురయ్యానంటూ పోస్ట్ పెట్టింది. తన దగ్గర డబ్బులు తీసుకుని..ఇప్పటికీ సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అనసూయ నెల క్రితం ట్రఫుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్ సైట్ లో కొన్ని దుస్తులను ఆర్డర్ పెట్టింది. ముందే డబ్బులు చెల్లించింది. కానీ ఇప్పటికీ తనకు సదరు వస్తువులు రాలేదని.. అదే టైంలో రీఫండ్ కూడా రాలేదని చెప్పుకొచ్చింది. సొంతంగా దుస్తులు అమ్ముతున్నామని చెప్పి డబ్బులు కాజేస్తున్నారని మండిపడింది. ఈ విషయంపై తాను స్పందించకూడదని అనుకున్నానని.. కానీ మిగతా వారు తనలాగా మోసపోవద్దని చెప్పేందుకే ఈ పోస్ట్ చేసినట్లు పేర్కొంది.

అనసూయ మాత్రమే కాకుండా చాలా మందికి ఇలాంటి ఆన్ లైన్ మోసాలు ఎదురవుతున్నారు. అందుకు తగినట్లే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు అనసూయ సైతం ఆన్ లైన్ మోసానికి గురైంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అనసూయ రెండు తమిళ సినిమాలు చేస్తుంది. అలాగే తెలుగులో పలు రియాల్టీ షోలలో పాల్గొంటుంది. తెలుగులో చివరగా పుష్ప 2 చిత్రంలో కనిపించింది.

Anasuya

Anasuya

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.