
కొత్త సినిమాలు రిలీజ్ అయిన సాయంత్రానికే పైరసీ అయ్యి ఫోన్ లో వచ్చేస్తున్నాయి.. కానీ పాత సినిమాలు మాత్రం రీ రిలీజ్ అయ్యి థియేటర్స్ లో అదరగొడుతున్నాయి. నెలకు మూడు నాలుగు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో సోసోగా ఆడుతుంటే.. రీరిలీజ్ సినిమాలు మాత్రం అదరగొడుతున్నాయి. ఇప్పటికే దాదాపు అందరు హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే రీరిలీజ్ సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషంగా రెస్పాన్స్ వస్తుంది. ప్రేక్షకులు సినిమాలను ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే.. థియేటర్స్ లో సినిమాలోని సీన్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారు. మొదట్లో పాటలకు డాన్స్ లు వేసి వైరల్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సీన్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారు.
తమ అభిమాన హీరో సినిమా రి రిలీజ్ అయితే ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంత కాదు. సినిమాలో మంచిసీన్ వస్తే అదే సీన్ ను రీ క్రియేట్ చేసి సందడి చేస్తుంటారు. తాజాగా క్లాసిక్ హిట్ అందాల రాక్షసి సినిమా కూడా రీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అలాగే రాహుల్ రవీంద్రన్, నవీన్ చంద్ర కూడా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. హనురాఘవపూడి దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదలైన సమయంలో మిక్స్ టాక్ సొంతం చేసుకుంది. ఆతర్వాత మెల్లగా హిట్ టాక్ అందుకుంది.
జూన్ 13న అందాల రాక్షసి సినిమా రీ రిలీజ్ అయ్యింది. థియేటర్స్ లో ఫ్యాన్స్ ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేశారు. అలాగే ఈ సినిమా చూడటానికి హీరోలు నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్ కూడా సంధ్య థియేటర్ కు వెళ్లారు. ఇక సినిమాలో తన ఐకానిక్ సీన్ రాగానే నవీన్ చంద్ర లేచి ఆ సీన్ ను రీ క్రియేట్ చేశాడు. “ఏ మాంత్రమో అల్లేసిందిలా..”సాంగ్ సమయంలో ఒక్కసారిగా లేచి డాన్స్ చేశాడు నవీన్ చంద్ర. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
#NaveenChandra at Sandhya 70 MM#AndalaRakshasiRerelease pic.twitter.com/Vj31VKs52L
— Whynot Cinemas (@whynotcinemass_) June 13, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.