
చేసిన తక్కువ సినిమాలే అయినా కూడా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. రీసెంట్ డేస్ లో చాలా మంది హీరోయిన్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ ముద్దుగుమ్మ చేసింది మూడు సినిమాలు అందులో రెండు బ్లాక్ బస్టర్స్ ఒకటి అట్టర్ ఫ్లాప్. ఇంతకూ ఆ చిన్నది ఎవరో తెలుసా.? తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. తన నటీన, అభినయంతో కట్టిపడేసింది ఈ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఒక్క అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఈ చిన్నదానికి ఇప్పుడు అవకాశాలుతక్కువయ్యాయి. ఇటీవలే ఓ బ్లాక్ బస్టర్ మూవీలో ఓ చిన్న రోల్ చేసింది. ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?
కొన్ని సినిమాలతోనే పాపులర్ అయిన ఈ చిన్నది ఎవరో కాదు.. బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. అందాల భామ మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మరాఠీ బుల్లితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత నెమ్మదిగా కథానాయికగా మారింది. హిందీలో హీరోయిన్ ఆఫర్స్ అందుకుంటూ అద్భుతమైన నటనతో మెప్పించింది. మృణాల్ కు ఎక్కువగా క్రేజ్ వచ్చింది మాత్రం తెలుగు సినిమాతోనే. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది.
ఇందులో సీతామహాలక్ష్మీ పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. తెలుగుతోపాటు అటు హిందీలోనూ మరిన్ని ఆఫర్స్ అందుకుంది. అయితే ఫ్యామిలీ మ్యాన్ సినిమా తర్వాత మృణాల్ సైలెంట్ అయ్యింది. ఈ సినిమా నిరాశపరచడంతో మృణాల్ కు అంతగా ఆఫర్స్ రావడం లేదు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కల్కి సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మృణాల్ మాట్లాడుతూ.. నా కెరీర్ బిగినింగ్ లో నేను చాలా ఆఫర్స్ వదులుకున్నా.. ఆ సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ కారణంగా నా పేరెంట్స్ వద్దన్నారు. ఇంటిమేట్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ చేసినప్పుడు నేను భయపడతాను. అందువల్లే చాలా ఆఫర్స్ కు నో చెప్పా.. ఆతర్వాత నా పేరెంట్స్ ను కూర్చోబెట్టి వివరించా.. ఇంటిమేట్ సీన్స్ అనేవి సినిమాలో భాగమే.. నేను నో చెప్పడం వల్ల మంచి అవకాశాలను మిస్ చేసుకున్నా.. అలా అని అన్ని అలాంటి సినిమాలే చేస్తానని కాదు అంటూ చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.