Most Recent

Jabardasth: నాకోసం పెళ్లి పీటలమీదనుంచి వచ్చేసేది.. లవ్ స్టోరీ బయట పెట్టిన జబర్దస్త్ నరేష్..

Jabardasth: నాకోసం పెళ్లి పీటలమీదనుంచి వచ్చేసేది.. లవ్ స్టోరీ బయట పెట్టిన జబర్దస్త్ నరేష్..

ప్రముఖ టీవీ ఛానల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ కామెడీ ప్రోగ్రాం.. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది నటీ నటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొంతమంది హీరోలుగా, మరికొంతమంది దర్శకులుగా , కమెడియన్స్ గా సెటిల్ అయ్యారు. ఎంతో మంది ట్యాలెంటెడ్‌ కమెడియన్స్‌ను వెలుగులోకి తీసుకొచ్చిన షో జబర్దస్త్. అలాంటి ఈ షో నుంచి షైన్‌ అయ్యాడు నరేష్. తనకున్న వైకల్యాన్నే.. తనకు ప్లస్‌గా మార్చుని బుల్లి తెరపై రాణిస్తున్నాడు. జబర్దస్త్ ఒక్కటే కాదు… మల్లెమాల ప్రొడక్షన్స్‌లో చాలా షోలే చేస్తున్నాడు. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. తన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు నరేష్.

ఇది కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. ఎవరో కనిపెట్టరా.?

ఇప్పటికీ పలు టీవీ షోలు, ఈవెంట్స్ చేస్తూ సందడి చేస్తున్నాడు నరేష్. ఇదిలా ఉంటే జబర్డస్త్ షోలో తన కామెడీతోనే కాదు లవ్ ట్రాక్ తో కూడా హాట్ టాపిక్ అయ్యాడు నరేష్. సీరియల్ నటి షబీనా షేక్ తో లవ్ ట్రాక్ నడిపాడు నరేష్. స్టేజ్ పై ఆమెను పడేయడానికి నరేష్ చేసే ప్రయత్నాలు చేసి ప్రేక్షకులకు నవ్వులు పంచాడు. ఇక ఈ ఇద్దరూ లవ్ లో ఉన్నారు. నరేష్ షబీనా షేక్ ను డీప్ గా లవ్ చేశాడు అని అని అందరూ అనుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీని పై నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడు..

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా..! జయం సినిమా చిన్నది.. ఎంత మారిపోయింది..!! స్టార్ హీరోయిన్స్‌ను బీట్ చేసేలా ఉందిగా..

నరేష్ మాట్లాడుతూ.. నా పెళ్లి గురించి ఎవరెవరో.. ఏదేదో అనుకుంటున్నారు. కానీ నాకు పెళ్లి కాలేదు. ఇంకో రెండు ఏళ్లలో పెళ్లి చేసుకుంటా..? నాకు అందంగానే ఉండాలి, మోడ్రన్ గా ఉండాలి అనే అసలు లేవు.. మా అమ్మ నాన్నను మంచిగా చూసుకునే అమ్మాయి అయితే చాలు. అలాగే ఇండస్ట్రీ అమ్మాయి అయినా.. బయట అమ్మాయి అయినా నాకు పర్లేదు.. మనసు మంచిది అయితే చాలు. ఇక షబీనా షేక్ తో లవ్ ట్రాక్ అనేది కేవలం స్కిట్ కోసమే..  మా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేసింది రోజా గారే.. అది కేవలం స్టేజ్ వరకే.. ఆమె పెళ్ళికి నన్ను పిలిచింది.. కానీ పెళ్లి గుంటూరు లో కావడంతో నేను వెళ్ళలేకపోయాను. పెళ్ళికి వెళ్తే నన్ను చూసి పీటలమీదనుంచి వచ్చేసేదేమో.. అంటూ సరదాగా అన్నాడు నరేష్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! అచ్చం మీరాజాస్మిన్‌లానే ఉందే.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

 

View this post on Instagram

 

A post shared by SHAIK SHABEENA (@shabeena_actress)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.