
దక్షిణాదిలో మోస్ట్ పాపులర్ హీరోయిన్లలో ఆమె ఒకరు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటుంది. అంతేకాకుండా ఇప్పుడిప్పుడే తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అవకాశాలు సొంతం చేసుకుంటుంది. తనే హీరోయిన్ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ సినిమాతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తొలి చిత్రమే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ అయ్యింది. ఆ తర్వాత కోబ్రా సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ఇటీవలే హిట్ 3 సినిమాతో మరో విజయాన్ని అందుకుంది. న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మరోసారి అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఇప్పుడు తెలుగులో ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ అమ్మడుకు మరో క్రేజీ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. లేటేస్ట్ టాక్ ప్రకారం ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఈ అమ్మడు నటించనున్నట్లు సమాచారం.
తాజాగా కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తమిళంలో భారీ ఛాన్స్ వచ్చింది. అదేంటంటే.. తమిళ్ స్టార్ హీరో అజిత్ త్వరలో నటించనున్న తన 64వ సినిమాలో శ్రీనిధిని ఎంపిక చేశారని టాక్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో హిట్ అందుకున్న అజిత్.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల తర్వాత ఇప్పుడు అజిత్ చేయబోయే సినిమాపై మరింత హైప్ నెలకొంది. అజిత్ 64వ చిత్రానికి కూడా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తారని నివేదికలు తెలుపుతున్నాయి.
ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే నవంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల చేయనున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటించనున్నట్లు టాక్. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రూపొందించనున్నారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..