Most Recent

Cinema: రిలీజ్‌కు ఏడాది ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతోన్న ఆ సినిమా టికెట్లు

Cinema: రిలీజ్‌కు ఏడాది ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతోన్న ఆ సినిమా టికెట్లు

సినిమాల విడుదలకు రెండు రోజులు లేదా వారం ముందు అడ్వాన్స్ బుకింగ్‌లు తెరవడం సర్వ సాధారణం. భారతదేశంలోనే కాదు, దాదాపు అన్ని దేశాలలో కూడా ఇదే పరిస్థితి. కానీ ఈ సినిమా విడుదలకు ఒక సంవత్సరం ముందే అడ్వాన్స్ బుకింగ్‌లు తెరిచారు మేకర్స్. ఆడియెన్స్ కూడా టిక్కెట్లు కొనడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. దీనికి కారణం ఆ సినిమా దర్శకుడిపై ఆడియెన్స్ కు ఉన్న నమ్మకం. క్రిస్టోఫర్ నోలన్ ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులలో ఒకరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ స్కూల్స్‌లో ఆయన సినిమాలను పాఠాలుగా చెబుతారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానిక, శాస్త్రీయ అంశాలను జోడించి సినిమాలను తెరకెక్కించడంలో క్రిస్టోఫర్ నోలన్ దిట్ట. ‘ఇంటర్‌స్టెల్లార్’, ‘ఇన్సెప్షన్’, ‘ముమెంటో’, ‘టెనెట్’, ‘ఒపెన్‌హైమర్’, ‘డంకిర్క్’ సినిమాలు నోలన్ డైరెక్షన్ కు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇప్పుడు ఆయన ది ఒడిస్సీ అనే మరో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

క్రీస్తుపూర్వం 700 ప్రాంతంలో హోమర్ రాసిన అదే పేరుతో ఉన్న కథ ఆధారంగా క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు మాట్ డామన్ ‘ది ఒడిస్సీ’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హాలండ్, జెండయా, అన్నా హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్ తదితర హాలీవుడ్ స్టార్స్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఒడిస్సీ సినిమా వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది. అయితే ఇప్పటి నుంచే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

వచ్చే ఏడాది జులైలో సినిమా రిలీజ్.. కానీ అప్పుడే..

ప్రస్తుతం ది ఒడిస్సీ కేవలం IMAX 70mm స్క్రీన్లకు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాను IMAX 70mm కెమెరాలో షూట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం రీల్స్ వాడుతున్నారు.. ఈ కారణంగా, ఇప్పుడు IMAX 70mm స్క్రీన్లకు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.

స్టార్ నటీనటులందరూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.