-
టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హోమ్లీ హీరోయిన్స్ లో లయ ఒకరు. తన అందం, అభినయంతో తెలుగు వారికి బాగా దగ్గరైందీ అందాల తార.
-
అయితే హీరోయిన్గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిపోయింది లయ. 2006లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేశన్ ను వివాహం చేసుకుందీ అందాల తార.
-
పెళ్లి తర్వాత భర్తతో కలిసి అమెరికాకు వెళ్లిన లయ అక్కడే సెటిల్ అయ్యింది ప్రస్తుతం ఈ దంపతులకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు.
-
కాగా ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దవారు కావడంతో సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది లయ. నితిన్ హీరోగా నటిస్తోన్న తమ్ముడు సినిమాలో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
-
సినిమాల సంగతి పక్కన పెడితే.. తాజాగా తన తల్లి పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది లయ. తన స్నేహితులు, సన్నిహితులను పిలిచి వారందరి మధ్య తన తల్లితో కేక్ కట్ చేయించింది.
-
తన తల్లి బర్త్ డే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది లయ. ఈ ఫొటోలకు 'హ్యాపీ బర్త్ డే అమ్మా! లవ్యూ సో మచ్' అని క్యాప్షన్ తో అమ్మపై తనకున్నప్రేమను చాటుకుంది.