Most Recent

Rekha Vedavyas: చాలా నరకం అనుభవించాను.. మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..

Rekha Vedavyas: చాలా నరకం అనుభవించాను.. మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..

రేఖ వేదవ్యాస్.. తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2001లో ఆనందం సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ అయిన ఈ అమ్మడు .. ఆ తర్వాత ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకున్నాం వంటి చిత్రాల్లో నటించి జనాలకు దగ్గరయ్యింది. ఒకప్పుడు ఆమె కుర్రాళ్ల కలల రాణి. అందం, అభినయంతో మెస్మరైజ్ చేసిన ఈ చిన్నది.. ఎక్కువగా కన్నడలోనే సినిమాలు చేసింది. తెలుగులో ఈ బ్యూటీకి తక్కువగా అవకాశాలు వచ్చాయి. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. 2014 తర్వాత ఆమె వెండితెరపై కనిపించలేదు.

ఇవి కూడా చదవండి: Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

చాలా కాలం సినిమాకు దూరంగా ఉన్న రేఖా.. గతంలో ఓ రియాల్టీ షోలో పాల్గొని అభిమానులకు షాకిచ్చింది. అందులో పూర్తిగా బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితిలో కనిపించింది. అనారోగ్యంతోనే సన్నబడినట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఆమె రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు పంచుకుంది. బెంగళూరులో పుట్టి పెరిగిన నటి రేఖ వేదవ్యాస్.. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ స్టార్ట్ చేసింది. తెలుగు, కన్నడలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తాను ముంబైలో ఉంటున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి: Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!

రేఖా మాట్లాడుతూ.. “వ్యక్తిగత కారణాల వల్ల నేను 2014 నుండి 2020 వరకు సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నాను. కోవిడ్ రాకముందు నేను మళ్ళీ నటించాలని అనుకున్నాను. అప్పుడు నేను ఒక టెలివిజన్ షోలో కూడా కనిపించాను. అప్పుడు కోవిడ్ సమస్య వచ్చింది. ఆ తర్వాత అనారోగ్యంతో బాధపడ్డాను. దీంతో శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను. చాలా నరకం అనుభవించాను. తిరిగి మళ్లీ కోలుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది. సమస్య ఏమిటో చెప్పాలని లేదు. కానీ ఒక ఆరోగ్య సమస్య మనిషిని ఇంతగా బాధపెడుతుందా అని అర్థమైంది. ఇప్పటివరకు నేను పెళ్లి చేసుకోలేదు. ఈమధ్య విడాకులు పెరిగిపోతున్నాయి. అందుకే సరైన వ్యక్తి దొరికిన తర్వాత పెళ్లి చేసుకుంటాను” అని చెప్పుకొచ్చింది.

Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.