Most Recent

Tollywood: ఇండస్ట్రీలోకి ఫ్లాప్ హీరోయిన్.. హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ.. కానీ కాలు కదపాలంటే కోట్లు ఇవ్వాల్సిందే..

Tollywood: ఇండస్ట్రీలోకి ఫ్లాప్ హీరోయిన్.. హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ.. కానీ కాలు కదపాలంటే కోట్లు ఇవ్వాల్సిందే..

సినీరంగంలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమేమి కాదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పటికీ.. హిట్స్ అందుకోలేరు కొందరు హీరోయిన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తార సైతం అలాంటి జాబితాలోకి వస్తుంది. ఇప్పటివరకు ఎన్నో అవకాశాలు అందుకుంది. కానీ హిట్ల కంటే ప్లాపులే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ వచ్చింది. కానీ సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. నిత్యం ఏదోక విషయంలో వార్తలలో నిలుస్తుంది. ఆమె ఇటీవల ఒక్క స్టేజ్ పెర్ఫార్మెన్స్ కు రూ.7 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. అందాల పోటీలు అయినా మిస్ దివా, మిస్ యూనివర్స్ ఇండియా 2015 టైటిల్స్ గెలుచుకుంది. మిస్ యూనివర్స్ 2015 లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ పాటలకు ఆమె కేరాఫ్ అడ్రస్.

ఇవి కూడా చదవండి: Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ప్రస్తుతం ఈ హీరోయిన్ వయసు 34 సంవత్సరాలు. ఇండస్ట్రీలో హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ. అయినా నెట్టింట క్రేజ్ మాత్రం ఎక్కువే. ఒకప్పుడు తన పుట్టినరోజున బంగారు కేక్ కట్ చేయడంతో వార్తలలో నిలిచింది.అలాగే 24 క్యారెట్ల బంగార్ ఫోన్ కవర్ వాడుతూ కనిపించింది. ఆమె మరెవరో కాదు.. ఊర్వశి రౌతేలా. ప్రస్తుతం బాలీవుడ్, ఇండస్ట్రీలలో స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్. ఇటీవల సౌదీలో ఓ స్టేజ్ పెర్పార్మెన్స్ కోసం ఊర్వశికి రూ.7 కోట్లు చెల్లించారట. తెలుగులో డాకు మహారాజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

ఇవి కూడా చదవండి: Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!

ఊర్వశి సన్నీ డియోల్ చిత్రం సింగ్ సాబ్ ది గ్రేట్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హేట్ స్టోరీ 4, పాగల్పంతి, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే వంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెకు 71.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA (@urvashirautela)

Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.