
టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకోగా త్వరలోనే తొమ్మిదో సీజన్ కూడా రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నాగార్జుననే ఈసారి షోను హోస్ట్ చేయనున్నారు. ‘ ఈసారి చదరంగం కాదు రణరంగం’ అంటూ హోస్ట్‌గా అక్కినేని నాగార్జున పంచ్ డైలాగ్ బిగ్ బాస్ కొత్త సీజన్ పై ఆసక్తి పెంచింది. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతోంది. కాగా బిగ్ బాస్ షో అంటేనే సెలబ్రిటీల షో అని బయట టాక్ ఉంది.
ఇది కూడా చదవండి : బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిన నటి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్
బుల్లితెర ప్రముఖులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెర్లనే ఇందులోకి కంటెస్టెంట్లుగా తీసుకుంటారు. గతంలో కొన్ని సార్లు సామాన్యులను తీసుకొచ్చినా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ టీం మరోసారి సామాన్య ప్రజలకు ఒక బంపరాఫర్ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ఇప్పటికే చాలా మంది అప్లై చేస్తున్నారు. ఇక చాలా మంది సామాన్యులు కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇక కొంతమంది సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని బిగ్ బాస్ లోకి పంపండి అంటూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చేస్తూ షేర్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఎలాంటి అమ్మాయి ఎలా మార్చేశారా..! నటనతో పిచ్చెక్కించిన ఈ భామ ఎవరో తెలుసా..?
కొంతమంది చిత్ర విచిత్రంగా బిగ్ బాస్ లోకి పంపాలని వీడియోలతో రిక్వెస్ట్ చేస్తున్నారు. కొంతమంది నిరాహారదీక్షలు చేస్తున్నారు. మరికొంతమంది సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియావు తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ మహిళ తనను బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలని వేడుకుంటూ వీడియో చేసింది. నాగార్జున గారు నన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపండి.. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా.. మీకు అద్భుతమైన టీ, అద్భుతమైన కాఫీ ఇస్తాను. మీకే కాదు అందరికి మంచి ఛాయ్ పెట్టి .. రోటి పచ్చళ్ళతో మంచి భోజనం చేసి పెడతా.. ఒక్కసారి అవకాశం ఇస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటా అంటూ వీడియో చేసి షేర్ చేసింది ఆ మహిళ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.” ఇవన్నీ వాళ్ళు కి వండి పెట్టే బదులు మంచి హోటల్ పెట్టుకోమ్మా గౌరవంతో పాటు డబ్బులు కూడా వస్తాయ్” అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి :18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది.. రెండు సార్లు విడాకులు.. చివరకు ఇప్పుడు ఇలా
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి