
ఇటీవల కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్, మిస్టరీ జానర్ సినిమాలు చూసేందుకు అడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నెట్టింట సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీస్ సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతున్న సినిమా గురించి తెలుసుకుందామా. అదే ది డిప్లొమాట్. ఈ సినిమా సాధారణ భారతీయ తల్లి ఉజ్మా అహ్మద్ పాత్రతో ప్రారంభమవుతుంది. ఆమె ప్రపంచం మొత్తం తన కూతురే. ఆ అమ్మాయి చికిత్సకు సహాయం చేయడానికి తాహిర్ అనే పాకిస్తానీ యువకుడు ముందుకు వస్తాడు. ఆమెను ప్రేమ పేరుతో పాకిస్తాన్ పిలుస్తారు. ఆ తర్వాత ఆమె జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడు నిత్యం వేధిస్తుంటాడు.
కానీ కొన్ని రోజులకే అసలు నిజం బయటపడుతుంది. అతడికి అప్పటికే భార్య, పిల్లలు ఉంటారు. అతడి జీవితం పూర్తిగా క్రూరత్వంతో ఉంటుంది. కానీ ఆమె ప్రేమను వదులుకోవడానికి ఇష్టపడదు. ఆమె భారతదేశానికి తిరిగి రావడానికి నేరుగా భారత రాయబార కార్యాలయానికి వెళ్తుంది. కానీ చట్టపరమైన అడ్డంకులు వస్తాయి. దీంతో ఆమె ప్రాణాలు సైతం ప్రమాదంలో పడిపోతాయి. చివరకు ఆమె ఇండియాకు ఎలా తిరిగి వచ్చింది.. ? ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? అనేది సినిమా.
ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో నటించగా.. సాదియా కతీబ్ మరో పాత్రలో నటించారు. ఇది యథార్థ గాథ. 2017లో ఉజ్మా అహ్మద్ అనే భారతీయ వివాహితను పాకిస్తాన్ కు చెందిన తాహిర్ అనే యువకుడు మాయ మాటలతో తమ దేశం రప్పించుకుంటాడు. ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న కష్టాలను ఈ సినిమా రూపంలో తీసుకువచ్చారు మేకర్స్.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..