
ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే విశ్వంభర చిత్రంలో నటిస్తున్న చిరు.. ఇటీవలే డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ట విశ్వంభర చిత్రానికి దర్శకత్వానికి వహిస్తున్నారు. సోషియో ఫాంటసి యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే వరుసగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటినీ పెంచారు మేకర్స్. తాజాగా మరోసారి ఫ్యాన్స్ ముందుకు క్రేజీ అప్డేట్ తీసుకువచ్చారు.
ఇవి కూడా చదవండి: Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
విశ్వంభర సినిమా షూటింగ్ ఎట్టకేలకు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో భాగంగా ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఫోటో పంచుకున్నారు. ఈ పాటకు గణేశ్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో మంచి మాస్ డ్యాన్స్ నంబర్ కంపోజ్ చేశారు.ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. “విశ్వంభర తన చివరి షెడ్యూల్ ను అద్భుతమైన డ్యాన్స్ నంబర్ తో ప్రారంభమైంది. మెగాస్టార్ స్టైల్, గ్రేస్ తో గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో ఈ పాటను చిత్రీకరిస్తున్నాం. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన ట్రీట్ ఎదురుచూస్తుంది” అని తెలిపారు.
#Vishwambhara begins its last schedule with an electrifying dance number
MEGASTAR @KChiruTweets's style and grace unleashed under the choreography of @Acharya1Ganesh Master for the mass beats by #BheemsCeciroleo
An absolute treat awaits the audience
MEGA MASS… pic.twitter.com/um6fDFJ4gy
— UV Creations (@UV_Creations) July 25, 2025
ఇవి కూడా చదవండి: Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!
ఇక ఈ సినిమాలో స్పెషల్ పాటలో మెగాస్టార్ తో కలిసి బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ విషయం అధికారికంగా వెల్లడించలేదు. నాగిని సీరియల్ ద్వారా పాపులర్ అయిన మౌనీ రాయ్.. ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో నటిస్తుంది. కేజీఎఫ్ చాప్టర్ 1లో స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు విశ్వంభర చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది.
మౌనీరాయ్ ఇన్ స్టా..
View this post on Instagram
Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..