Most Recent

Ram Charan : ఫ్యాన్స్ అయితే మరీ ఇలా చేస్తారా.. ? క్లింకారాతో ఆసుపత్రికి రామ్ చరణ్.. ఎగబడ్డ అభిమానులు..

Ram Charan : ఫ్యాన్స్ అయితే మరీ ఇలా చేస్తారా.. ? క్లింకారాతో ఆసుపత్రికి రామ్ చరణ్.. ఎగబడ్డ అభిమానులు..

అభిమానం హద్దులు దాటుతుంది. ఇటీవల సెలబ్రెటీలు కనిపిస్తే ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా ఉండడం లేదు. ఇటీవల నిధి అగర్వాల్, సమంతతోపాటు.. కోలీవుడ్ విజయ్ దళపతికి సైతం చేదు సంఘటనలు ఎదురయ్యాయి. చెన్నై విమానాశ్రయంలో విజయ్ కారు వైపు వెళ్తుంటే సెల్ఫీలో కోసం ఎగబడ్డారు ఫ్యాన్స్. ఇప్పుడు హైదరాబాద్ అపోలో ఆసుపత్రి వద్ద రామ్ చరణ్ విషయంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జనవరి రాత్రిన కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు బాబు, పాప జన్మించినట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇద్దరు చిన్నారుల రాకతో తమ ఇంట్లో సంతోషం రెట్టింపు అయ్యిందని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..

ఇదంతా పక్కన పెడితే.. రామ్ చరణ్ తన భార్య ఉపాసనను, కవలలను చూడటానికి తన పెద్ద కుమార్తె క్లీంకారతో కలిసి అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. చరణ్ కారు దిగగానే వందలాది మంది ఫ్యాన్స్ ఒక్కసారిగా అక్కడకు చేరుకున్నారు. చరణ్ తో సెల్ఫీలు దిగేందుకు మీదకు పరిగెత్తారు. కనీసం కారు డోర్ తీసి చరణ్ కిందు దిగడానికి కూడా వీలు లేకుండా చుట్టుముట్టారు. ఆ సమయంలో చరణ్ చేతిలో క్లీంకార ఉంది. అభిమానుల హడావిడి చూసి క్లీంకార సైతం భయపడినట్లు తెలుస్తోంది. దీంతో చరణ్ ఒకింత అసహనానికి గురైనట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..

ఆసుపత్రి వద్ద కారు దిగి ఆసుపత్రికి వెళ్లే 30 సెకన్స్ లలో అరాచకం సృష్టించారు అభిమానులు. అలాగే క్లీంకార ఫోటోస్ తీయడానికి ఫ్యాన్స్ ప్రయత్నించగా.. ఆ పిక్స్ పోస్ట్ చేయొద్దని.. పాప ప్రైవసీని కాపాడాలని చరణ్ అభిమానులను కోరారు. ఫ్యాన్స్ తీరుపై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.