Most Recent

Tollywood: కమల్ హాసన్ అనుకొని కార్ ఆపేశారు.. కట్ చేస్తే.. తెలుగులో పవర్ ఫుల్ ప్రొడ్యూసర్..

Tollywood: కమల్ హాసన్ అనుకొని కార్ ఆపేశారు.. కట్ చేస్తే.. తెలుగులో పవర్ ఫుల్ ప్రొడ్యూసర్..

పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని గుర్తుపట్టారా.. ? తెలుగు సినిమా ప్రపంచంలో పవర్ ఫుల్ ప్రొడ్యుసర్. అతడి తమ్ముడు తెలుగులో తోపు హీరో. ఆయన మరెవరో కాదండి.. నిర్మాత సురేష్ బాబు. తెలుగు చలన చిత్రపరిశ్రమలో విజయవంతమైన నిర్మాతలలో దగ్గుబాటి రామానాయుడు ఒకరు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. రామనాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబు. నిర్మాతగా ఆ సంస్థను ముందుకు తీసుకెళ్లి తండ్రి బాటలోనే సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక రెండో కుమారుడు వెంకటేశ్ హీరోగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోలలో వెంకీ ఒకరు. రామానాయుడు అప్పట్లో పలు ఇంటర్వ్యూలలో తన కుమారుల గురించి స్పందిస్తూ..సురేష్ బాబును ముందుగా నటుడిగా చేద్దామని అనుకున్నారని.. కానీ ఆయనకు నటనపై ఆసక్తి లేకపోవడంతో ఊరుకున్నారట.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..

సురేష్ బాబు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎంతో హ్యాండ్సమ్ గా ఉండేవారని.. అచ్చం కమల్ హాసన్ లా కనిపించేవారట. అప్పట్లో ఆయన్ని చూసి చాలా మంది కమల్ హాసన్ అనుకునేవారని.. చెన్నై వీధుల్లో సురేష్ బాబును వెళ్తుంటే కారాపి మరీ కమల్ హాసన్ అని చూడటానికి ప్రజలు వచ్చేవారని రామానాయుడు చెబుతూ ఉండేవారు. అందుకే సురేష్ బాబును నటుడిగా చేయాలనుకున్నారట. కానీ ఆయనకు నటనపై ఆసక్తి లేకపోవడంతో ఆ ఆలోచన మార్చుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..

కలియుగ పాండవులు సినిమాతో తన రెండో కుమారుడు వెంకటేశ్ ను హీరోగా వెండితెరకు పరిచయం చేశారు రామానాయుడు. ఆ సమయంలో వెంకీ అమెరికాలో ఉండగా.. పిలిపించి మరీ ఆ సినిమాతో కథానాయకుడిగా అరంగేట్రం చేయించారు. ఒకే సినిమాకు పెద్ద కుమారుడు నిర్మాతగా, హీరోగా చిన్న కుమారుడు సినీరంగంలోకి అడుగుపెట్టారు. నిజానికి కలియుగ పాండవులు సినిమాను కృష్ణ చేయాల్సిందట. డేట్స్ కుదరకపోవడంతో వెంకీ వచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

Venkatesh, Suresh Babu

Venkatesh, Suresh Babu

ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.