
ఈ మధ్య కాలంలో రీరిలీజ్ లు హావ ఎక్కువగా కనిపిస్తుంది. హీరోల బర్త్ డేలకు.. స్పెషల్ డేలకు ఆల్రెడీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకున్న సినిమాలను మరోసారి థియేటర్స్ లు తీసుకువస్తున్న మేకర్స్. అంతే కాదు ఆ సినిమాలు రికార్డ్ స్థాయిలోకలెక్షన్స్ కూడా రాబడుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో ఈ ట్రెండ్ మరోసారి మొదలైంది. పోకిరి సినిమా దిమ్మతిరిగే కలెక్షన్స్ ను సొంతం చేసుకోవడంతో ఆ కలెక్షన్స్ కు పోటీ పడేలా ఇతర హీరోల సినిమాకు కూడా రీ రిలీజ్ అయ్యాయి. స్టార్ హీరోలు మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇలా స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి సందడి చేశాయి. ఇక ఈ వారం కూడా రీ రిలీజ్ కు హవ కనిపించనుంది. ఇప్పటికే కొన్ని సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. కొన్ని సినిమాలు రిలీజ్ కు రెడీగాను ఉన్నాయి. ఇక ఈ వారం మహేష్ బాబుతో పాటు సూర్య సినిమా కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతుంది.
బిజినెస్ మ్యాన్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో బిజినెస్ మ్యాన్ ఒకటి. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. పోకిరి సినిమా తర్వాత ఈ కాంబినేషన్ లో వచ్చిన బిజినెస్ మ్యాన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో పూరి మార్క్ డైలాగ్స్, మహేష్ బాబు యాక్టింగ్ హైలైట్ అనే చెప్పాలి. ఈ సినిమాకు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న రీరిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
సూర్య సన్ ఆఫ్ కృష్ణన్
తమిళ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు మనదగ్గర కూడా మంచి హిట్స్ గా నిలిచాయి. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ అవ్వనుంది. ఆగస్టు 4( ఈ రోజు) రీ రిలీజ్ కానుంది. ఈ సినిమా సంగీతాన్ని హారిస్ జయరాజ్ అందించారు. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి.