
తెలుగు సినిమా ప్రపంచంలో రొమాన్స్, రూమర్స్ కొత్తేం కాదు. ఒక హీరోయిన్ తన కో-స్టార్‌ను అమితంగా ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు అది వైరల్ అవ్వడం సహజమే. ఇటీవల ‘ఆంధ్రా కింగ్ తాలూక’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో ఒక యంగ్ హీరోయిన్ స్టేజ్ మీదకు వచ్చి, రామ్ పోతినేని గురించి మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంది. ఆమె పొగడ్తలతో రామ్ ముఖం తడుముకుంటూ, నవ్వుతూ కనిపించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫ్యాన్స్ ‘లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్’ అంటూ కామెంట్స్ పెట్టుతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె రామ్ గురించి ఏం మాట్లాడింది?
ఇటీవల విశాఖపట్నం RK బీచ్‌లో ‘ఆంధ్రా కింగ్ తాలూక’ మ్యూజికల్ కాన్సర్ట్‌లో జరిగింది. డైరెక్టర్ మహేష్ బాబు పచిగొళ్ళా డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ పోతినేని సాగర్ పాత్రలో నటిస్తున్నాడు. సాగర్ అనేది సూపర్‌స్టార్ ‘ఆంధ్రా కింగ్’ సూర్య (ఉపేంద్ర) డై-హార్డ్ ఫ్యాన్. సినిమాలే అతని ప్రపంచం. షోలు ఆలస్యమైతే చాలు థియేటర్ అద్దాలు పగలగొడతాడు, హీరోను డిఫెండ్ చేయడానికి గొడవలు చేస్తాడు.
ఫస్ట్ డే టికెట్ల కోసం పోరాడతాడు. ఈ సినిమా నవంబర్ 27న విడుదలకానుంది. అయితే తాజాగా జరిగిన ఈవెంట్‌లో హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే హీరో రామ్ గురించి మాట్లాడిన మాటలు రూమర్స్‌కి దారితీశాయి. వీరిద్దరూ ఇంతకుముందు ఎంగేజ్‌మెంట్ రూమర్స్‌తో కూడా ట్రెండ్ అయ్యారు, కానీ ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు.
ఈవెంట్‌లో హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే స్టేజ్ మీదకు వచ్చి, రామ్ పోతినేని గురించి మాట్లాడుతూ ‘ఫ్యాన్స్‌ను ఎంతో ప్రేమిస్తూ వారి కోసం సినిమా తీసే ఒక్క మనిషి ఎవరు? ఫ్యాన్స్ కోసం అన్నీ చేయడానికి సిద్ధంగా ఉండే ఒక్కరు ఎవరు? అది ఒక్కరే.. ఏమంటారు? కింగ్ ఆఫ్ హార్ట్స్ అంటారు. మీరు రామ్ అని పిలుస్తారు’ అంటూ మొదలుపెట్టింది. రామ్ ఆమె మాటలు వింటూ సర్ప్రైజ్ అయ్యి, ముఖం తడుముకున్నాడు.
Bhagyasree
‘ఈరోజు అన్నీ అతని గురించే. మనం లేదా ఇతరుల గురించి కాదు. రామ్ పోతినేని గురించి మాత్రమే. ఇక్కడ ఉన్న మొత్తం ప్రేమకు నీవే అర్హుడివి. థ్యాంక్ యూ రామ్, నువ్వు బెస్ట్. సక్సెస్ లేదా ఫెయిల్యూర్ అని లెక్కలేకుండా, టాప్ పొజిషన్‌లో ఉన్నా లేదా మనతో ఉన్నా, నువ్వు మాకు ఎప్పటికీ టాప్. వీ లవ్ యూ’ అంటూ చెప్పుకొచ్చింది.
ఈ వీడియో వచ్చిన వెంటనే ఫ్యాన్స్ రియాక్షన్ రకరకాలుగా ఉంది. ‘రీల్ లైఫ్‌లో మంచి పెయిర్, రియల్ లైఫ్‌లో కూడా!’ అంటూ ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు ‘ఆమె అతని పేరు అన్ని సార్లు చెప్పింది చూస్తే లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్ అనిపిస్తుంది. రూమర్స్ ట్రూ!’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘వైఫ్ హస్బెండ్‌ను డిఫెండ్ చేస్తోంది’ అంటూ జోక్స్ కూడా వేస్తున్నారు. కొందరైతే ‘భాగి పోతినేని’ అంటూ షిప్పింగ్ ట్రెండ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలంటే ఎవరో ఒకరు అధికారికంగా ప్రకటించేవరకు వేచిచూడాల్సిందే!