
సాధారణంగా మలయాళీ సినిమాలకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. హారర్, రొమాంటిక్, కామెడీ ఇలా జానర్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది. చిన్న చిన్న సినిమాలు ఇప్పటికే భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అనేక చిత్రాలు ఓటీటీలో అందుబాటులో ఉండగా.. ఓటీటీలోకి మరో మలయాళీ సూపర్ హిట్ కామెడీ సిరీస్ రాబోతుంది. అదే అవిహితం. సెన్నా హెగ్డే దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ కామెడీ చిత్రం ఇది. ఒక గ్రామంలో ఉండే పురుషుల చుట్టూ ఈసినిమా కథ తిరుగుతుంది. పితృస్వామ్య నేపధ్యంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేస్తుంది.
ఇవి కూడా చదవండి : Gouri Kishan: నీ బరువు ఎంత ? రిపోర్టర్ ప్రశ్న.. హీరోయిన్ మాస్ రిప్లై..
ఈ చిత్రంలో ఉన్నిరాజ్, రెంజి కంకోల్, వినీత్ చాక్యార్, ధనేష్ కొలియత్, రాకేష్ ఉషార్, బృందా మీనన్, అజిత్ పున్నాడ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీరాజ్ రవీంద్రన్, రమేష్ మాథ్యూస్ సినిమాటోగ్రఫీని అందించగా, శ్రీరాగ్ సాజి సంగీతాన్ని అందించారు. అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ చిత్రం నవంబర్ 14న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీతోపాటు పలు భాషలలో స్ట్రీమింగ్ కానుంది.
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..
థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. కొన్నాళ్లుగా మలయాళంలో విడుదలైన చిత్రాలకు తెలుుగులోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..
ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?