
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఈ మధ్యన పెద్దగా సినిమాలు చేయట్లేదు. కానీ ఈ ముద్దుగుమ్మ తరచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది. శిల్పా శెట్టి మరియు ఆమె భర్త రాజ్ కుంద్రాపై రూ.60 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక వ్యాపారవేత్త వీరిపై కేసు నమోదు చేశాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఈ కేసు సాల్వ్ అయ్యేంతవరకు శిల్పాశెట్టి దంతపులు దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు ఆదేశాలిచ్చింది. తాజాగా ఈ ఛీటింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆర్థిక నేరాల విభాగం (EOW) శిల్పా కంపెనీలోని నలుగురు మాజీ ఉద్యోగులను విచారణ కోసం సమన్లు జారీ చేసింది. ఉద్యోగులలో ఒకరిపై కేసు నమోదు చేయగా, మిగిలిన ముగ్గురిపై ఇంకా విచారణ జరుగుతోంది. ఈ నలుగురూ గతంలో బెస్ట్ డీల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో పనిచేశారు. ఆ కంపెనీ ఉద్యోగుల్లో ఒకరు ఇప్పటికే క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరై తన కథను మాకు చెప్పారని ఒక అధికారి తెలిపారు. త్వరలోనే ముగ్గురు ఉద్యోగులను విచారణకు పిలిపిస్తారు.
రాజ్ కుంద్రా కంపెనీని దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తోంది. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను విచారిస్తున్నారు. ఈ ఉద్యోగులకు రాజ్ కుంద్రా ఎంత జీతం ఇచ్చాడు. ఈ వ్యక్తులు ఏమి చేశారు? వారందరినీ విచారిస్తారు. కంపెనీకి సరిగ్గా డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఆఫీస్ ఫర్నిచర్ కోసం రూ.20 లక్షల వరకు ఖర్చు చేసినట్లు కూడా వెల్లడవుతోంది. ఈ 20 లక్షలు ఎక్కడి నుండి వచ్చాయో దర్యాప్తు చేస్తున్నారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా కంపెనీ మరికొంత మందిని మోసం చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కొన్ని సంవత్సరాల క్రితం జైలు జీవితం గడపవలసి వచ్చింది. ఈ సమయంలో, శిల్పా శెట్టి రాజ్ కుంద్రాకు విడాకులు ఇస్తారని కూడా ప్రచారం జరిగింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి