Most Recent

Tollywood: ఒకప్పుడు చిరంజీవికి అక్కగా నటించింది.. కట్ చేస్తే.. 54 ఏళ్ల వయసులో కుర్ర హీరోయిన్లకు పోటీ.. ఎవరంటే..

Tollywood: ఒకప్పుడు చిరంజీవికి అక్కగా నటించింది.. కట్ చేస్తే.. 54 ఏళ్ల వయసులో కుర్ర హీరోయిన్లకు పోటీ.. ఎవరంటే..

మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్న చిరు.. మరోవైపు అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన శంకరవరప్రసాద్ గారు చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలతోపాటు మరిన్ని చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఒకప్పుడు చిరుతో కలిసి నటించిన హీరోయిన్స్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. సిమ్రాన్, రమ్యకృష్ణ, మీనా వంటి తారలు యంగ్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. కానీ ఒకప్పుడు చిరుకు అక్కగా కనిపించిన ఓ హీరోయిన్ మాత్రం ఇప్పుడు ఫిట్నెస్ విషయంలో షాకిస్తుంది. 54 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా కనిపిస్తూ కుర్రహీరోయిన్లకు గట్టిపోటీనిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఫైన ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ మరెవరో కాదు.. సీనియర్ హీరోయిన్ ఖుష్బూ..

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

ఖుష్బూ.. దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో ఆమె అందానికి అభిమానులు గుడి కట్టి పూజించారు. ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో చక్రం తిప్పిన ఖుష్బూ.. స్టాలిన్ చిత్రంలో మాత్రం చిరుకు అక్కగా కనిపించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ అదే. అప్పట్లో హీరోయిన్ గా రాణించిన ఖుష్బూ.. ఇప్పుడు యంగ్ హీరోల సినిమాల్లో తల్లిగా, అత్తగా, వదినగా కనిపిస్తుంది. మరోవైపు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఖుష్బూ చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. ఇటీవల ఆమె తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోయారు. పూర్తిగా బరువు తగ్గి సన్నజాజిలో మారిపోయింది. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి స్టైలీష్, స్లిమ్ గా కనిపిస్తుంది. 54 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఫోటోలను షేర్ చేస్తూ బ్యాక్ టు ది ఫ్యూచర్ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఖుష్బూ ఫోటోలకు నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఖుష్బూ.. వెంకటేశ్ నటించిన కలియుగ పాండవులు మూవీతో హీరోయిన్ గా మారింది. డైరెక్టర్ సుందర్.సిను ఖుష్బూ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు.

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

 

View this post on Instagram

 

A post shared by Kushboo Sundar (@khushsundar)

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.