Most Recent

కుర్రకారుకు నిద్రలేని రాత్రులు.. 450కి పైగా సినిమాల్లో నటించిన అమ్మడు.. కానీ ఎప్పుడూ హీరోయిన్ కాలే..

కుర్రకారుకు నిద్రలేని రాత్రులు.. 450కి పైగా సినిమాల్లో నటించిన అమ్మడు.. కానీ ఎప్పుడూ హీరోయిన్ కాలే..

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎంతో హీరోయిన్లుగా అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అంతలోనే ఇండస్ట్రీ నుంచి దూరమైన తరాలను సైతం చూశాం. కానీ ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఓ భామ.. అప్పట్లో తోపు నటి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. దాదాపు 450కిపైగా చిత్రాల్లో నటించింది. కానీ ఎప్పుడూ కూడా మెయిన్ హీరోయిన్ గా నటించలేదు. అప్పట్లో ఆమె సినిమా వచ్చిందంటే చాలు జనాలు థియేటర్లకు క్యూ కట్టేవాళ్లు. స్టార్ హీరోహీరోయిన్లకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆత్మహత్య చేసుకుని అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆమె మరెవరో కాదు.. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలిన సిల్క్ స్మిత.

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..

సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. ఆమె 18 సంవత్సరాలలో 450 కి పైగా చిత్రాలలో నటించింది. అనేక హిట్ చిత్రాల్లో స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పట్లో తనకంటూ ఓ స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ ఆమె విజయం సాధించినప్పటికీ, ఆమెకు ఎప్పుడూ ప్రధాన హీరోయిన్ పాత్ర దక్కలేదు. సిల్క్ స్మిత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాలలో కూడా నటించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమెకు చాలా చిన్న వయస్సులోనే వివాహం చేశారు. ఆ తర్వాత భర్త, అత్తింటివాళ్లు దారుణంగా వేధించారు. సిల్మ్ స్మితకు వివాహం జరిగినప్పుడు ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. అత్తింటి వేధింపులు భరించలేక చిన్న వయసులోనే ఇంటి నుంచి పారిపోయింది.

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

ఆమె నటి అపర్ణకు ఆమె నటి అపర్ణకు మేకప్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. కానీ 1979లో తమిళ చిత్రం ‘వండిచక్కరం’లో చిన్న పాత్రలో నటించింది. ఈ సినిమాతో ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమాతోనే ఆమె పేరు సిల్క్ స్మిత అని మారిపోయింది. మలయాళ దర్శకుడు ఆంటోనీ ఈస్ట్‌మన్. ‘వండిచక్కరం’లో ఆమె పాత్ర పేరు ‘సిల్క్’ను ఆమె తన రంగస్థల పేరుగా మారింది. ఈ సినిమా తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో స్పెషల్ పాటలతో అదరగొట్టింది. అప్పట్లో గ్లామర్ బ్యూటీగా ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. ఒకనొక సమయంలో హీరోల కంటే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంది. దాదాపు 450కి పైగా సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు ఎప్పుడు మెయిన్ హీరోయిన్ రోల్ రాలేదు. కానీ సినిమాల్లో సక్సెస్ అయినప్పటికీ ఆమె జీవితంలో ప్రేమ కలిసి రాలేదు. ప్రేమలో మోసపోవడంతో ఆమె 35 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకుంది. 1996లో సూసైడ్ చేసుకుంది. సిల్క్ స్మిత మరణం అప్పట్లో ఇండస్ట్రీని కుదిపేసింది.

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

Silk Smitha. New

Silk Smitha. New

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.