Most Recent

Kantara Chapter 1 : రిషబ్ శెట్టి నయా రికార్డ్.. కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల సునామీ.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..

Kantara Chapter 1 : రిషబ్ శెట్టి నయా రికార్డ్.. కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల సునామీ.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..

కన్నడ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ 1 ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించింది. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలకపాత్రలు పోషించారు. 2022లో విడుదలైన కాంతార సినిమాకు ప్రీక్వెల్ ఇది. మొదటి రోజు నుంచి మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం ఇప్పుడు రూ.500 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సాధించిన వసూళ్లను తెలుపుతూ నిర్మాణ సంస్థ తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.509 కోట్లు సాధించినట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

ఇదిలా ఉంటే.. పాజిటివ్ మౌత్ టాక్ తో దూసుకుపోతున్న కాంతార.. ఇప్పటికే పలు రికార్డ్స్ తిరగరాసింది. ఇప్పుడు 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా నిలిచింది. త్వరలోనే ఈ మూవీ మొదటి స్థానంలోకి వెళ్లే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సంవత్సరంలోనే విడుదలైన రష్మిక మందన్నా ఛావా సినిమా రూ.600 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి సినిమాగా టాప్ స్థానంలో ఉంది. కాంతార 1 థియేటర్లలో హౌస్ పుల్ బోర్డులతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కేవలం 9 రోజుల్లోనే ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్ లో చేరింది.

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

త్వరలోనే ఈ మూవీ మరిన్ని రికార్డ్స్ బీట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో విడుదలైన కాంతార చిత్రం రూ.550 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. కాంతార సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వంటి పాన్ ఇండియన్ భాషలలో విడుదలైంది. ఈ సినిమాతో అటు రుక్మిణి వసంత్ పేరు సైతం మారిపోయింది.

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.