
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం భారత ప్రభుత్వం తరపున సెప్టెంబర్ 2025లో అట్టహాసంగా జరిగింది. అదే విధంగా తమిళనాడు ప్రభుత్వం సైతం సినీరంగంలో విశేష సేవలు అందించిన నటీనటులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం కలైమామణి. ఈ అవార్డును నటీనటులతోపాటు సంగీత దర్శకులకు, నిర్మాతలకు, దర్శకులను గౌరవిస్తూ అందిస్తుంది. తాజాగా శనివారం సాయంత్రం చెన్నైలో ఈ అవార్డుల ప్రదానోత్స వేడుక ఘనంగా జరిగింది. 2021, 2022, 2023 సంవత్సరాలకుగానూ ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. అలాగే నటీనటులు, సినీప్రముకులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మొత్తం 90 మంది సినీప్రముఖులకు కలైమామణి అవార్డులు ప్రదానం చేశారు.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
2021కిగానూ నటనా విభాగంలో హీరోయిన్ సాయి పల్లవి రాష్ట్ర సీఎం స్టాలిని చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. అలాగే 2023 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా నటుడు కె మణికందన్ అవార్డును గెలుచుకున్నారు. విక్రమ్ ప్రభు, ఎస్.జె. సూర్య కూడా ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. 2021, 2022, 2023 సంవత్సరాలకు ఉత్తమ సంగీత స్వరకర్త అవార్డును అనిరుధ్ రవిచందర్ కు ప్రదానం చేశారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా సంగీత స్వరకర్త అనిరుధ్ ఈ అవార్డును అందుకున్నారు.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
కలైమామణి అవార్డుకు దర్శకుడు ఎన్. లింగుసామి, గాయని సుజాత మోహన్ సహా వివిధ సినీ ప్రముఖులు హాజరయ్యారు. సంగీతానికి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి అవార్డును గాయకుడు కె.జె. యేసుదాస్‌కు ప్రదానం చేశారు. దాదాపు మూడేళ్లకు గానూ మొత్తం 90 మందికి ఈ పురస్కారాలను అందజేశారు.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?
.#TamilNadugovernment #MKStalin | #KalaimamaniAwards | #Anirudh | #ajsuryah | #vikramprabhu #SaiPallavi | #Kalaimamani | #TamilNews | #LatestNews pic.twitter.com/SgThEGBaiq
— FridayCinema (@FridayCinemaOrg) October 11, 2025
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..