Most Recent

Cinema : మనసులను హత్తుకునే ప్రేమకథ.. 9 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..

Cinema : మనసులను హత్తుకునే ప్రేమకథ.. 9 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..

తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్నో ప్రేమకథలు సక్సెస్ అయ్యాయి. ఎలాంటి హడావిడి లేకుండా వచ్చిన లవ్ స్టోరీ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పటికీ ఆ సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే దాదాపు 9 ఏళ్ల క్రితం థియేటర్లలో విడుదలైన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అప్పట్లో ఆ సినిమాలోని సాంగ్స్, డైలాగ్స్ తెగ పాపులర్ అయ్యాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మరేదో కాదు. మెగా డాటర్ నిహారిక కొణిదెల అప్పట్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ నటించిన ఒక మనసు. యంగ్ హీరో నాగ శౌర్య, నిహారిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాకు మధుర శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలు, హడావిడి లేకుండా విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

ముఖ్యంగా ఈ సినిమా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. అప్పట్లో ఈ సినిమాలోని ప్రతి డైలాగ్ తెగ పాపులర్ అయ్యింది. “నీ మీద ప్రేమ చావదు.. ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు..”, “ప్రేమకు చావులేదంటారు కదా సూర్య.. అలాంటప్పుడు చచ్చేంత ప్రేమ ఎలా పుడుతుంది..” అంటూ వచ్చే డైలాగ్స్ జనాలను కట్టిపడేశాయి. తండ్రి కోసం రాజకీయాల్లోకి రావాలనుకునే సూర్య పాత్రలో నాగశౌర్య, మెడిసిన్ చదివే స్టూడెంట్ సంధ్య పాత్రలో నిహారిక నటించింది.

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

ఇందులో వీరిద్దరి యాక్టింగ్, కెమిస్ట్రీ జనాలకు తెగ నచ్చేశాయి. ప్రేమకథగా వచ్చిన ఈ సినిమాలో సాంగ్స్, బీజీఎమ్, ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..

 

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.