Most Recent

OTT Movie:పెళ్లి కాని అమ్మాయిలను సైనైడ్‌తో చంపే సైకో కిల్లర్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ స్టోరీ

OTT Movie:పెళ్లి కాని అమ్మాయిలను సైనైడ్‌తో చంపే సైకో కిల్లర్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ స్టోరీ

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (అక్టోబర్ 17) పలు కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే ఒక క్రైమ్ థ్రిల్లర్ మాత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లుతోంది. ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అద్దిరిపోయే ట్విస్టులు ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తున్నాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. ఒక అమ్మాయి అదృశ్యంతో ఈ సినిమా కథ మొదలవుతుంది. ఆ తర్వాత వరుసగా అలాంటి కేసులే బయటపడతాయి. దీంతో ఈ అమ్మాయిల మిస్సింగ్ కేసులను ఒక సీనియర్ పోలీసాఫీసర్ టేకప్ చేస్తాడు. కట్ చేస్తే.. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఒక సైకో కిల్లర్ ఈ హత్యలకు పాల్పడుతున్నాడని తెలుస్తుంది. పెళ్లి కావడం లేదని ఆందోళన చెందుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ నేరాలు చేస్తున్నాడని ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది.

అమ్మాయిలను ఆకర్షించడం, వారిని లైంగికంగా ఆర్థికంగా దోచుకోవడం, గర్భనిరోధక మాత్రలు అని చెప్పి సైనైడ్ మాత్రలు ఇవ్వడం, ఆపై వారిని పబ్లిక్ రెస్ట్‌రూమ్‌లలో చనిపోయేలా వదిలేయడం.. ఇలా ఓ పద్ధతిలో మర్డర్స్ చేస్తుంటాడు ఈ సైకో కిల్లర్. మరి ఆ సైకో కిల్లర్ ను పోలీసులు ఎలా పట్టుకున్నారు? అసలు ఆ సైకో కిల్లర్ మోటివ్ ఏంటి? ఎందుకీ హత్యలు చేస్తున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఐఎమ్ డీబీలోనూ టాప్ రేటింగ్..

ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాపేరు ‘భగవత్ చాప్టర్ 1-రాక్షస్’. అర్షద్ వార్సీ, జితేంద్ర కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.