Most Recent

Producer SKN:మరోసారి గొప్ప మనసు చాటుకున్న ‘బేబీ’ నిర్మాత.. ఆ హీరో అభిమానికి అండగా నిలిచిన ఎస్కేఎన్

Producer SKN:మరోసారి గొప్ప మనసు చాటుకున్న ‘బేబీ’ నిర్మాత.. ఆ హీరో అభిమానికి అండగా నిలిచిన ఎస్కేఎన్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ అలియాస్ శ్రీనివాస్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బేబీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ తో పాటు పలు సినిమాలను నిర్మించే పనుల్లో బిజీగా ఉంటున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే తన ఉపన్యాసాలు, కామెంట్స్, సోషల్ మీడియా పోస్టులతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు ఎస్కేఎన్. ఒక్కోసారి ట్రోలింగ్, విమర్శలు కూడ ఎదుర్కొంటుంటారు. అయితే ఒక్క విషయంలో మాత్రం ఎస్కేఎన్ ను మెచ్చుకోవచ్చు. కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదన్న మాటను నిజం చేస్తూ గుప్త దానాలు చేస్తుంటారు ఎస్కేఎన్. కష్టాల్లో ఉన్న ఎంతో మందికి ఆపన్న హస్తం అందించారీ నిర్మాత. ఇబ్బందుల్లో ఉన్నామని ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చాలు వెంటనే రెస్పాండ్ అవుతారు ఎస్కేఎన్. అన్ని విషయాలు కనుక్కుని మరీ సాయం చేస్తారు. తాజాగా మరోసారి గొప్ప మనసు చాటుకున్నారీ నిర్మాత.

ఇటీవల మహేష్ బాబు వీరాభిమాని రాజేష్ అనే వ్యక్తి మరణించాడు. దీంతో ఆయన స్నేహితులు రాజేష్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాజేష్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారని, దాతలు తన కుటుంబాన్న ఆదుకోవాలని బ్యాంక్ కు సబంధించిన వివరాలను షేర్ చేశారు. ఈ పోస్ట్ కాస్త ఎస్కేఎన్ దృష్టి కూడా వెళ్లడంతో వెంటనే ఆయన స్పందించారు.

‘ఒక హీరో అభిమానిగా నేను మరొక అభిమాని భావోద్వేగాలను, ఉద్వేగాలను అర్థం చేసుకోగలను. ఈ విషయం నన్ను చాలా బాధ కలిగించింది. ప్రతి ఒక్కరి జీవితంలో చదువు అనేది చాలా ముఖ్యం అయితే ఈ ఘటన కారణంగా మరణించిన వ్యక్తి పిల్లల చదువులు ఆగిపోకూడదు. ఆ కుటుంబానికి నా వంతుగా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను. త్వరలోనే ఇందుకు సంబంధించి అన్నీ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను. రాజేష్ కుటుంబాన్ని ఆదుకునేందుకు మరికొందరు ముందుకు రావాలి’ అని కోరారు ఎస్కేఎన్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నిర్మాత ఎస్కేఎన్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

నిర్మాత ఎస్కేఎన్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.