
యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్ సినిమాలు ఉండచ్చు. కానీ సింహరాశి మాత్రం చాలా స్పెషల్. 2001లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రాజశేఖర్ ను ఓ డిఫరెంట్ హీరోగా ప్రజెంట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమా చూస్తుంటే చాలా సార్లు మన కళ్లు తెలియకుండానే కన్నీళ్లతో తడిసిపోతాయి. అంత ఎమోషన్స్ తో సాగుతుందీ సినిమా. ముఖ్యంగా హీరో చిన్నప్పటి సీన్లు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఈ సినిమా వచ్చి దాదాపు 24 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా టీవీలో వస్తే చాలు చానెల్ మార్చకుండా ఈ సినిమాను చూస్తారు చాలా మంది. తమిళ హిట్ చిత్రం ‘మాయి’కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రాజశేఖర్ సరసన సాక్షి శివానంద్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాగే ఆనంద్ రాజ్, గిరిబాబు, బ్రహ్మనందం, ఎంఎస్ నారాయణ, వేణు మాధవ్, అచ్యుత్, చలపతిరావు, కోవై సరళ, పొన్నాంబళం.. ఇలా చాలా మంది నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు.
శివరామరాజు, ఎవడైతే నాకెంటి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన వి. సముద్ర సింహరాశి సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇదే అతనికి మొదటి సినిమా కావడం గమనార్హం. అయినా తన టేకింగ్ తో రీమేక్ సినిమా అని తెలియకుండా సింహారాశి సినిమాను తెరకెక్కించాడీ సీనియర్ డైరెక్టర్. ముఖ్యంగా నరసింహరాజు (రాజ శేఖర్) పాత్రను తీర్చిదిద్దిన తీరు అద్బుతమని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహారాశి సినిమాకు హీరోగా రాజశేఖర్ ఫస్ట్ చాయిస్ కాదట. అమ్మ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాను మొదట నందమూరి బాలకృష్ణతో చేయాలని అనుకున్నారట. అయితే అప్పటికే బాలయ్య చేతిలో పలు సినిమాలు ఉండడంతో ఈ కథపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేపోయాడట. దీంతో మేకర్స్ వెంటనే రాజశేఖర్ తలుపు తట్టారట. ఆయన వెంటనే ఓకే చెప్పడంతో సింహారాశి సినిమా పట్టాలెక్కింది. అలా మొత్తానికి బాలయ్య ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ మిస్ అయ్యిందన్న మాట.
అఖండ 2 సినిమాలో బాలకృష్ణ..
The divine action is back! Getting ready for the ultimate rampage with the God of Masses. The countdown to the biggest cinematic ‘Thaandavam’ has begun. #Akhanda2ModeOn
#Akhanda2thaandavam#NandamuriBalakrishna pic.twitter.com/YHKL0NdV65
— Nandamuri Balakrishna (@NBK_Unofficial) October 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.