
ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, వ్యక్తుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ రియల్ స్టోరీలకు మంచి ఆదరణ ఉంటోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక రియల్ స్టోరీనే. గతేడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఐఎమ్ డీబీలోనూ దాదాపు 8 రేటింగ్ తో ఈ సినిమా ఉంది.బస్తీ నేపథ్యంలో సాగే ఒక ఆసక్తికర ప్రేమకథా చిత్రమిది.యువతలో చాలామంది నిజమైన ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా తప్పటడుగులు వేస్తుంటారు. ఇది వారి జీవితాలను ఎలాంటి ప్రమాదంలోకి నెట్టుతోందన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. పాఠశాల నుంచి కాలేజీ స్థాయిలో ఉండే లవ్ స్టోరీలు.. వాటి వల్ల చదువుల్ని నిర్లక్ష్యం చేయడంతో వచ్చే నష్టాలు, తెలియని వయసులో ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలను కళ్లకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారు.
లాలస అనే అమ్మాయి కమల్ అనే అబ్బాయితో ప్రేమలో పడుతుంది. అలాగే సారస్ అనే మరో అబ్బాయిని కూడా ప్రేమిస్తుంది. కమల్ , సారస్ ఇద్దరు కూడా లాలస నీ గాఢంగా ప్రేమిస్తారు. లాలస కూడా ఇద్దరితో చాలా చనువుగా ఉంటుంది. ఇద్దరినీ ఇష్టపడుతుంది. మరి చివరికి లాలస కమల్ వైపు మొగ్గు చూపిందా ? సారాస్ వైపు మొగ్గు చూపిందా ? వీరి ప్రేమకథతో ఇంకెన్ని ట్విస్టులు జరిగాయో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమాపేరు ప్రేమించొద్దు. శిరిన్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అనురూప్, దేవమలిషెట్టి, సోనాలి గార్జే, సారిక, మానస, లహరి, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్‌తో పాటు బీసినీట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.\
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..
Im really overwhelmed & blessed because of the love you all have showered..
Thanks for giving me positive feedback about #Preminchoddu & my acting as well
Years of Hardwork..Years of Pain..Years of Struggle behind making this movie. Please stop piracy & save Cinema
Do… pic.twitter.com/opMT8v7wNJ
— Anurup Bhaskker (@ianurupreddy) January 21, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Thanks for giving me positive feedback about 