Most Recent

Kantara Chapter 1: బాక్సాఫీస్ వద్ద కాంతార విధ్వంసం.. రెండు రోజుల్లో కలెక్షన్ల సునామీ.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..

Kantara Chapter 1: బాక్సాఫీస్ వద్ద కాంతార విధ్వంసం.. రెండు రోజుల్లో కలెక్షన్ల సునామీ.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..

భారీ అంచనాల మధ్య విడుదలైన లేటేస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. మూడేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ ఇది. విడుదలకు ముందే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో దూసుకుపోతుంది. మొదటి రోజే భారీ వసూళ్లను రాబట్టింది. ఫస్ట్ డే ఈ సినిమా ప్రీమియర్స్ తో కలిపి మొత్తం రూ.89 కోట్లకు పైగా గ్రాస్ వసూల్లు వచ్చినట్లు మేకర్స్ తెలిపారు. 2025లో బిగ్గెస్ట్ ఓపెనర్స్ లో ఈ మూవీ ఒకటి. రిషబ్ శెట్టి కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. అయితే రికార్డు స్థాయిలో ఓపెనింగ్ సాధించిన తర్వాత, ‘కాంతారా చాప్టర్ 1’ రెండవ రోజు కూడా బలమైన కలెక్షన్లను సాధించింది.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

నివేదికల ప్రకారం రెండవ రోజు దాదాపు రూ.43.65 కోట్లు రాబట్టినట్లు సమాచారం. రెండు రోజుల్లోనే దేశవ్యాపంగా రూ.105.5 కోట్లు రాబట్టింది. వారాంతంలో ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. అన్ని భాషలలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. “కాంతార చాప్టర్ 1” ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన రెండవ కన్నడ చిత్రంగా నిలిచింది.గత నెలలో ₹92 కోట్లు వసూలు చేసిన “సు ఫ్రమ్ సో” కలెక్షన్లను ఈ చిత్రం అధిగమించింది.

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

ఈ సినిమాలో రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలకపాత్రలు పోషించారు. ప్రకృతితో ముడిపడి ఉన్న ప్రజల జీవితాలు, నమ్మకాలను ఈ చిత్రం ద్వారా అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు రిషబ్ శెట్టి. ఈసినిమాకు అజ్నీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రఫీ అరవింద్ కశ్యప్ అందించారు.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.