-
అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ అమ్మడు తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచుకుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్‌లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
-
బుల్లితెరపై సీరియల్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. సీరియల్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకొని,సిల్వర్ స్క్రీన్ పైకి అడుగు పెట్టి తన నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది.
-
సీతారామం మూవీతో టాలీవుడ్ అభిమానుల ఫేవరెట్ అయిపోయింది ఈ బ్యూటీ. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని వరసగా సినిమా ఆఫర్స్ అందుకుంది. తర్వాత ఫ్యామిలీ స్టార్, హాయ్ నాన్న పలు సినిమా చేసి తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
-
హాయ్ నాన్న సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ఫ్యామిలీ స్టార్ మూవీతో ఫ్లాప్ అందుకుంది. ఇక ఈ మూవీతో ఈ అమ్మడుకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కోలీవుడ్ చక్కేసింది ఈ చిన్నది.
-
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా బ్లాక్ డ్రెస్, తన అంద చందాలతో అందినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.




