Most Recent

Narne Nithiin: పెళ్లి పీటలెక్కన టాలీవుడ్ హీరో నార్నే నితిన్‌.. బామ్మర్ది వివాహ వేడుకలో ఎన్టీఆర్ సందడి చూశారా?

Narne Nithiin: పెళ్లి పీటలెక్కన టాలీవుడ్ హీరో నార్నే నితిన్‌.. బామ్మర్ది వివాహ వేడుకలో ఎన్టీఆర్ సందడి చూశారా?

టాలీవుడ్ హీరో, జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్‌ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. శివానీ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు. శుక్రవారం (అక్టోబర్ 10) రాత్రి హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. భార్య లక్ష్మీ ప్రణతితో పాటు కుమారులు అభయ్, భార్గవ్‌లతో కలిసి ఈ వివాహ వేడుకలో సందడి చేశాడు తారక్. ప్రస్తుతం నార్నే నితిన్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు

 

వధువు బ్యాక్ గ్రౌండ్ ఇదే..

ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్‌కు.. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట కృష్ణ ప్రసాద్ స్వరూప దంపతుల కుమార్తె శివానితో గతేడాది నవంబర్‌ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి, దగ్గుబాటి కుటుంబీకులు తదతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాగా శివానీ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్‌ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట. శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్‌కు కజిన్ డాటర్ అవుతుందని సమాచారం.

బామ్మర్ది పెళ్లిలో ఎన్టీఆర్ సందడి.. వీడియో ఇదిగో..

కాగా 2023లో మ్యాడ్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు నార్నే నితిన్. మొదటి సినిమాలోనే ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో నటించి ఆడియెన్స్ మన్ననలు అందుకున్నాడు. ఆ తర్వాత ఆయ్ సినిమాతోనూ ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఈ ఏడాది మాడ్ స్క్వేర్ తో వరుసగా హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. కొన్ని రోజుల క్రితమే ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ అంటూ మరోసారి ఆడియెన్స్ ను పలకరించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.