Most Recent

Cinema: మనుషులను చంపి మాంసాన్ని తినే సైకో కిల్లర్.. ఒక్కో సీన్ చూస్తే గుండెల్లో వణుకే.. ఒంటరిగా చూడొద్దు..

Cinema: మనుషులను చంపి మాంసాన్ని తినే సైకో కిల్లర్.. ఒక్కో సీన్ చూస్తే గుండెల్లో వణుకే.. ఒంటరిగా చూడొద్దు..

సినీరంగంలో ఈమధ్యకాలంలో కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. నిజమైన సంఘటనల ఆధారంగా సినిమాలను రూపొందించేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా మాత్రం భయంకరమైన నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీ ఒంటరిగా చూడాలంటే ఎంతో గుండె ధైర్యం ఉండాలి. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది. మన చుట్టూ సాధారణంగా కనిపించే మనుషుల మధ్యలో కొందరు అత్యంత క్రూరమైన వ్యక్తులు ఉంటారని.. కొందరు దారుణమైన హత్యలు సైతం చేసిన కిల్లర్స్ ఉంటారని ఈ సినిమా చూపిస్తుంది. ఈ మూవీలోని సీన్స్ గుండెల్లో వణుకుపుట్టిస్తాయి. అందుకే చిన్నపిల్లలు, ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడకూడదు..

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..

గతేడాది విడుదలైన ఈ చిత్రానికి ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించారు. 12th ఫెయిల్ హీరో విక్రాంత మాస్సే, దీపక్ డోబ్రియాల్, ఆకాష్ ఖురానా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా పేరు సెక్టార్ 36. ఈ కథలో మనసులను వెంటాడి చంపే సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత శవాల మంసాన్ని ఉడికించి తినడం అతడి అలవాటు. ఈ సినిమాలోని ప్రతి సీన్ ఒళ్లు జలదరించేలా చేస్తుంది. అనేక మలుపులు, ఊహించని భయానక దృశ్యాలు మిమ్మిల్ని దిగ్ర్భాంతికి గురిచేస్తాయి.

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాలోని బీజీఎమ్, సినిమాటోగ్రఫీ ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తాయి. ఈ మిడ్ బడ్జెట్ ప్రాజెక్టును కేవలం ఓటీటీ కోసమే రూపొందించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ చూడాలని ఇంట్రెస్ట్ ఉండే వారు ఈ చిత్రాన్ని గుండె ధైర్యం చేసుకుని చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

 

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.