Most Recent

Mirai OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘మిరాయ్’.. తేజ సజ్జా, మంచు మనోజ్‌ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

Mirai OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘మిరాయ్’.. తేజ సజ్జా, మంచు మనోజ్‌ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

గతేడాది హనుమాన్‌తో సూపర్‌ డూపర్‌ హిట్‌ అందుకున్నాడు తేజ సజ్జా. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నప్పటికీ మిరాయ్ వంటి మరో బ్లాక్ బస్టర్ తోనే మన ముందుకు వచ్చాడీ యంగ్ హీరో. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మంచు మనోజ్ విలన్ గా నటించడం విశేషం. రితికా నాయక్ హీరోయిన్ గా యాక్ట్ చేయంగా, సీనియర్ నటి శ్రియ మరో కీలక పాత్రలో మెరిసింది. సెప్టెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆస్తికరమైన కథా కథనాలు, తేజ సజ్జా, మంచు మనోజ్ ల పోటా పోటీ నటన, అబ్బురపరిచే యాక్షన్ సీక్వెన్సులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి.  కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన మిరాయ్ ఓవరాల్ గా రూ. 150 కోటలకు పైగా కలెక్షన్లు సాధించింది. రికార్డు వసూళ్లతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మిరాయ్ ను ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెరపడింది.

 

మిరాయ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 10 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇది వరకే సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే గురువారం అర్ధరాత్రి నుంచే మిరాయ్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగుతో పాటు పలు భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. పుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై  టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు నిర్మించిన మిరాయ్ సినిమాలో జగపతి బాబు, జయరాం, గెటప్ శీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. గౌరా హరి స్వరాలు సమకూర్చారు.  థియేటర్లలో కాసలు వర్షం కురిపించిన మిరాయ్ ఇప్పుడు ఓటీటీలో ఏ మేర రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

 

 జియో హాట్ స్టార్ లో మిరాయ్ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.