Most Recent

Actress: ఐశ్వర్య రాయ్ అందాన్నే ఛాలెంజ్ చేసి.. కట్ చేస్తే.. హిమాలయాల్లో సన్యాసిగా..

Actress: ఐశ్వర్య రాయ్ అందాన్నే ఛాలెంజ్ చేసి.. కట్ చేస్తే.. హిమాలయాల్లో సన్యాసిగా..

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులుగా గుర్తింపు రావడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేనివారు తారలుగా సక్సెస్ కావాలంటే ప్రతిభతోపాటు కాసింద అదృష్టం కూడా ఉండాలి. కానీ ఒకప్పుడు ఈ మెరిసే ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఓ హీరోయిన్. ఆమె మాధురీ దీక్షిత్, ఐశ్వర్య రాయ్ వంటి హీరోయిన్లకే పోటీ ఇచ్చింది. అప్పట్లో ఆమె పేరు ఫిల్మ్ వర్గాల్లో మారుమోగింది. కానీ లగ్జరీ లైఫ్ వదిలి.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సన్యాసిగా మారింది. ఒకప్పుడు రెడ్ కార్పెట్ మీద నడిచిన ఈ అమ్మడు.. ఇప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది. ఆమె మరెవరో కాదు.. ఒకప్పటి హీరోయిన్ బర్ఖా మధన్. ఈతరం ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని పేరు.

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

ఒకప్పుడు మిస్ ఇండియా అందాల పోటీలలో సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్ వంటి అందగత్తెలతో కలిసి ర్యాంప్ వాక్ నడిచిన అమ్మాయి.. ఇప్పుడు పర్వతాలలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతుంది. గ్లామర్ ప్రపంచాన్ని విడిచిపెట్టి శాంతి మార్గాన్ని ఎంచుకుంది. బర్ఖా మదన్ 1994లో.. ఆమె మిస్ ఇండియా పోటీలలో పాల్గొంది. అక్కడ మిస్ టూరిజం ఇండియా టైటిల్ గెలుచుకుంది. మలేషియాలో జరిగిన అంతర్జాతీయ అందాల పోటీలో మూడవ స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 1996లో సూపర్ హిట్ అయిన “ఖిలాడియోం కా ఖిలాడి”లో ఆమె అక్షయ్ కుమార్, రేఖ, రవీనా టాండన్‌లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

2003లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన భూత్ చిత్రంలో ామె మంజీత్ పాత్రలో కనిపించింది. ఇందులో తన అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. అప్పట్లో బుల్లితెరపై “న్యాయ్”, “1857 క్రాంతి” వంటి సీరియల్స్ చేసింది. అలాగే సాత్ ఫేరే వంటి షోలో పాల్గొంది. ఇప్పుడు మాత్రం సినిమాలకు, లగ్జరీ జీవితానికి దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది.

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..

 

View this post on Instagram

 

A post shared by Barkha Madan (@barkhamadan17)

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.