
ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సంచలనం సృష్టిస్తుంది. ఇందులో ఉత్కంఠ మొదటి నిమిషం నుండి ప్రారంభమవుతుంది. ఆరవ ఎపిసోడ్ దారుణమైన మలుపు తిరుగుతుంది. అప్పుడే ఒక షాకింగ్ విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సిరీస్ 2025లో వచ్చిన “జనవర్: ది బీస్ట్ వితిన్”. ఈ సిరీస్ ఛత్తీస్‌గఢ్‌లోని ఒక చిన్న పట్టణంలో జరిగే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్, ఇక్కడ యుగాల నాటి సామాజిక ఆచారాలు, కుల వివక్షత, నేరాలను చూపించారు. ఇందులో భువన్ అరోరా సబ్-ఇన్‌స్పెక్టర్ హేమంత్ కుమార్ పాత్రను పోషించారు. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
కథ విషయానికి వస్తే..
అడవిలో కుళ్ళిపోయిన శవం దొరకడంతో ప్రారంభమవుతుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభిస్తారు. ఈ కేసును SI హేమంత్ కుమార్‌కు అప్పగిస్తారు. పోలీసులు శవం నుండి ఒక్క క్షణం దూరంగా వెళ్ళినప్పుడు, దాని తల అదృశ్యమవుతుంది. హేమంత్ కుమార్ తన భార్య గర్భవతి కాబట్టి మరుసటి రోజు సెలవుపై వెళ్లాల్సి ఉంది. అయితే, అడవిలో తల లేని మృతదేహం దొరికిన కేసు కారణంగా అతని సెలవు రద్దు అవుతుంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే సోదరుడు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడని తెలుస్తుంది. పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండానే అతనిని కనుగొనమని ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి తెస్తాడు. మొత్తం ఏఢు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
ప్రతి ఎపిసోడ్ మలుపులతో సాగుతుంది. ఇందులో వినోద్ సూర్యవంశీ, ఇషికా డే, భగవాన్ తివారీ కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్ కు సచింద్ర వాట్స్ దర్శకత్వం వహించారు. భువన్ అరోరా నటించిన “జాన్వార్” సిరీస్ IMDb లో 7.4 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?