Most Recent

Ram Charan: ‘అన్నా జాగ్రత్త’.. ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ డేరింగ్ స్టంట్స్.. లీకైన వీడియో

Ram Charan: ‘అన్నా జాగ్రత్త’.. ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ డేరింగ్ స్టంట్స్.. లీకైన వీడియో

గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా పెద్ది. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ అంచనాలు పెంచేశాయి. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షూటింగ్ పూణేలో జరుగుతోంది. ఈ కొత్త షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రామ్ చరణ్ తో పాటు జాన్వీ కపూర్ కూడా పాల్గొంటోంది. హీరో, హీరోయిన్లపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ పాటకు సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో హీరో రామ్ చరణ్ ఓ ఎత్తైన కొండ ప్రాంతంలో డ్యాన్స్ వేస్తూ కనిపించాడు. చూస్తుంటే ఇది చాలా రిస్కీ సీన్ లా కనిపిస్తోంది. ఎందుకంటే చుట్టూరా లోతైన లోయ, అందులోనూ ఎండిపోయిన చెట్టు కొమ్మపై ఓ కాలు, మరో కాలు బండరాయిపై ఉంచి తన బాడీని బ్యాలెన్స్ చేస్తూ ఈ స్టెప్పలేస్తున్నాడు గ్లోబల్ స్టార్.

ప్రస్తుతం పెద్ది సాంగ్ షూట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన మెగాభిమానులు రామ్ చరణ్ డెడికేషన్ అండ్ డేరింగ్ కు ఫిదా అవుతున్నారు. రామ్ చరణ్ రియల్ హీరో అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అదే సమయంలో సినిమా కోసం ప్రాణాలు లెక్కచేయకపోవడంపై ‘అన్నా జాగ్రత్త’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా ఈ పాట విజువల్‌ ట్రీట్‌గా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.. అందుకే పర్వత ప్రాంతాల్లోనే ఎక్కువగా షూటింగ్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

వీడియో ఇదిగో..

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న పెద్ది సినిమా అరవై శాతం వరకూ షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.