Most Recent

Cinema : థియేటర్లలో బ్యాన్ చేశారు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా.. ఆస్కార్ వరకూ వెళ్లొచ్చింది..

Cinema : థియేటర్లలో బ్యాన్ చేశారు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా.. ఆస్కార్ వరకూ వెళ్లొచ్చింది..

విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఓ సినిమా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పరిస్థితులు, వర్గాల పెద్దరికం, అధికారాలకు సంబంధించిన ఇతివృత్తాలను అన్వేషిస్తుంది. లోతైన సామాజిక సమస్యలపై లోతుగా పరిశీలిస్తుంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ అడ్డుకట్ట వేసింది. దీంతో ఈ మూవీ థియేటర్లలో బ్యాన్ అయ్యింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమయ్యింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా షహానా గోస్వామి నటించిన పవర్ ఫుల్ పోలీస్ డ్రామా సంతోష్. ఇండియాలో బ్యాన్ అయిన ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ 17న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లయన్స్ గేట్ ప్లే లో రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..

ఈ చిత్రానికి సంధ్య సూరి దర్శకత్వం వహించారు. ఇందులో షహానా గోస్వామి కీలక పాత్రలో నటించారు. గతంలో కొన్ని వర్గాలు ఆందోళన చేయడంతో ఈ సినిమాను బ్యాన్ చేశారు. 2025 జనవరి 10న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. స్త్రీలపై చిన్నచూపు, కుల వివక్ష, పోలీసుల దౌర్జన్యం వంటి అంశాలను నేరుగా చూపించడంతో సెన్సార్ ఈ సినిమాకు అడ్డు చెప్పింది. ఇందులో చాలా సీన్స్ కట్ చేయాలని సెన్సార్ చెప్పినప్పటికీ.. ఆ మార్పులు చేస్తే సినిమా కథ పోతుందని డైరెక్టర్ ఒప్పుకోలేదు. దీంతో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు.

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

ఈ సినిమా 97వ అకాడమీ అవార్డులకు ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ విభాగంలో UK అధికారిక ఎంట్రీగా నిలిచింది. ఈ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగంలో ప్రీమియర్‌గా ప్రదర్శించబడింది. డిసెంబర్ లాంగ్‌లిస్ట్‌లోకి ప్రవేశించి ఉత్తమ డెబ్యూ ఫీచర్‌గా BAFTA నామినేషన్‌ను సంపాదించింది. ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ 17 నుంచి లయన్స్‌గేట్ ప్లేలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో కుశాల్ దుబే, సునీతా రాజవర్, సంజయ్ బిష్ణోయ్, శశి బెనివాల్ కీలకపాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.