-
తెలుగులో ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ జోష్ మీద దూసుకుపోతుంది. ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు స్టార్ హీరోల పక్కన కనిపించనుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ? సౌత్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
-
ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ రుక్మిణి వసంత్. కన్నడ భామ.. రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. ఇందులో ఆమె మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపిస్తూనే ఒక మంచి భార్యగా నటించి మెప్పించింది. ఈ మూవీ తెలుగులోనూ భారీ హిట్ అయ్యింది.
-
సప్త సాగరాలు దాటి సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు.. ఆ చిత్రంలో ఆమె లుక్స్, యాక్టింగ్ కు జనాలు ఫిదా అయ్యారు. సప్త సాగరాలు దాటి రెండు సినిమాలతో బాగా పాపులర్ అయ్యి వరుస అవకాశాలు తెచ్చుకుంది.
-
కన్నడలో బానదారియల్లి, భగీర, భైరతి రణగల్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తమిళంలో ఎస్, తెలుగులో అపుడో ఇపుడో ఎపుడో సినిమాలతో అలరించింది. ఇక తాజాగా తమిళంలో శివకార్తికేయన్ సరసన మదరాసి సినిమాలో నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 5న విడుదల కానుంది.
-
ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా, యష్ టాక్సిక్, రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 సినిమాల్లో నటిస్తుంది. ఇవన్నీ భారీ పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. ఇవే కాకుండా తెలుగు, తమిళంలో మరిన్ని అవకాశాలు అందుకుంటుంది.