Most Recent

Pawan Kalyan Birthday: హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్‌కు వెల్లువెత్తిన శుభాకాంక్షలు

Pawan Kalyan Birthday: హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్‌కు వెల్లువెత్తిన శుభాకాంక్షలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు.. నటుడిగా అగ్రస్థాయిలో నిలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా పదవీబాధ్యతలు చేపట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు. కాగా నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో అందరూ ఆయన విషెస్ తెలుపుతున్నారు. సినీ సెలబ్రెటీలు, అభిమానులతో పాటు రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ కు విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి పవన్ కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. “చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను.

ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో మావ..! డైరెక్టర్ రవికుమార్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!

అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్ కు విషెష్ తెలిపారు. “శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఎంతోమంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. సుపరిపాలనపై దృష్టి సారించడం ద్వారా పవన్ ఆంధ్రప్రదేశ్‌లో NDAని బలోపేతం చేస్తున్నారు. ఆయన దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను అని మోడీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రభాస్ కల్కి 2లో ఆ యంగ్ హీరో కూడా.. అభిమన్యుడి పాత్రలో ఎవరంటే

అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ కు విషెస్ తెలిపారు.” మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం.. అణువణువునా సామాజిక స్పృహ… మాటల్లో పదును… చేతల్లో చేవ… జన సైన్యానికి ధైర్యం.. మాటకి కట్టుబడే తత్వం.. రాజకీయాల్లో విలువలకు పట్టం.. స్పందించే హృదయం.. అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి.. మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్దిలో మీ సహకారం మరువలేనిది అని తెలియజేస్తూ.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

మోడీ విషెస్..

చంద్రబాబు నాయుడు విషెస్..

అల్లు అర్జున్ విషెస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.