Most Recent

Tollywood : 10 సంవత్సరాల్లో 4 బ్లాక్ బస్టర్ సినిమాలు.. ఇండస్ట్రీలోనే రికార్డ్ సృష్టించిన హీరో.. ఎవరో తెలుసా.. ?

Tollywood : 10 సంవత్సరాల్లో 4 బ్లాక్ బస్టర్ సినిమాలు.. ఇండస్ట్రీలోనే రికార్డ్ సృష్టించిన హీరో.. ఎవరో తెలుసా.. ?

2025 సంవత్సరంలో రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల మార్కును దాటిన సంగతి తెలిసిందే. దీంతో రజినీ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగుతుంది. ఇప్పటివరకు ఈ స్టార్ హీరో నటించిన మూడు సినిమాలు 500 కోట్ల క్లబ్‌లో చేరాయి. కానీ ఇప్పుడు అదే రికార్డును మరో హీరో ఖాతాలోకి వచ్చి చేరింది. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? ఆయన మరెవరో కాదండి.. అత్యధిక సినిమాలు 500 కోట్లు వసూలు చేసిన సూపర్ స్టార్ ప్రభాస్. ఈ జాబితాలో ప్రభాస్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతని నాలుగు సినిమాలు ఇప్పటివరకు 500 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి: ది బిగినింగ్ (650 కోట్లు) తో ప్రభాస్ ఈ క్లబ్‌లోకి ప్రవేశించాడు. దీని తరువాత మరో మూడు చిత్రాలతో ఈ ఘనతను సాధించాడు.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

ప్రభాస్ సినిమాలు బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (₹1788 కోట్లు), సాలార్ (₹617 కోట్లు), కల్కి 2898 AD (₹1042 కోట్లు) కూడా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల మార్కును దాటాయి. రెండు సినిమాలు 1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఇద్దరు సూపర్‌స్టార్‌లలో ప్రభాస్ ఒకరు. మరో సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్. అతడు నటించిన జవాన్ 1160 కోట్లు, పఠాన్ 1055 కోట్లు రాబట్టాయి. రెండింటి కలెక్షన్లు 500 కోట్లకు పైగా ఉండటంతో, రణ్‌బీర్ కపూర్, రానా దగ్గుబాటితో పాటు ఈ జాబితాలో ఐదవ స్థానానికి ప్రభాస్ చేరాడు.

ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు ఒక చిత్రనిర్మాత. ఇక పెదనాన్న కృష్ణం రాజు 1970లలో తెలుగు సినిమా రంగంలో పెద్ద స్టార్. ప్రభాస్ 2002లో ఈశ్వర్ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. రెండు సంవత్సరాల తర్వాత వర్షంతో పెద్ద బ్రేక్ పొందాడు. ఆ తర్వాత ఛత్రపతి, డార్లింగ్, బిల్లా వంటి విజయాలను అందుకున్నారు.. 2015లో ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ విజయం డార్లింగ్ ను పాన్-ఇండియా స్టార్‌గా మార్చింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

Prabhas News

Prabhas News

ఇవి కూడా చదవండి : గ్లామర్‏లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.